Advertisement

రెండు సినిమాలను కన్ఫర్మ్ చేసిన తేజ్

Posted : July 16, 2020 at 4:09 pm IST by ManaTeluguMovies

మెగా హీరో సాయి తేజ్ కెరీర్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. తన కెరీర్ లో వరసగా ఆరు ప్లాపులను అందుకున్న తర్వాత గతేడాది రెండు సినిమాలతో సాయి తేజ్ రెండు హిట్స్ తో లైన్లోకి వచ్చేసాడు. గతేడాది విడుదలైన చిత్రలహరి, ప్రతిరోజూ పండగే ఒకదాన్ని మించి మరొకటి విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.

ప్రస్తుతం తేజ్ సోలో బ్రతుకే సో బెటరు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొత్త దర్శకుడు సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపుగా 90 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇది కాకుండా తేజ్ దేవకట్టా దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిటయ్యాడు.

తాజా సమాచారం ప్రకారం సాయి తేజ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి దిల్ రాజు ప్రొడక్షన్ లో విరించి వర్మ దర్శకత్వంలో సినిమా కాగా, మరొకటి కొత్త దర్శకుడితో పనిచేయనున్నాడు.

కొత్త కుర్రాడు గోపాల్ చెప్పిన కథకు తేజ్ ఫిదా అయ్యాడు. వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. టాగోర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు త్వరలోనే రానున్నాయి.


Advertisement

Recent Random Post:

Maharaja – Trailer (Telugu) | Vijay Sethupathi |Anurag Kashyap | Mamta Mohandas | NithilanSaminathan

Posted : May 31, 2024 at 2:54 pm IST by ManaTeluguMovies

Maharaja – Trailer (Telugu) | Vijay Sethupathi |Anurag Kashyap | Mamta Mohandas | NithilanSaminathan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement