Advertisement

మదర్ రోల్ పుకార్లని కొట్టిపారేసిన అనసూయ.!

Posted : July 17, 2020 at 10:13 pm IST by ManaTeluguMovies

నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ తాజాగా యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ కు తల్లి పాత్రలో నటించేందుకు ఓకే చెప్పింది అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో శ్రీకాంత్‌ మరియు ఇంద్రజలు హీరో తల్లిదండ్రుల పాత్రల్లో నటించేందుకు కమిట్‌ అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఇంద్రజ సినిమా నుండి తప్పుకుందట.

దాంతో ఆ పాత్రను అనసూయ వద్దకు తీసుకు వెళ్లగా ఛాలెంజ్‌గా తీసుకుని నటించేందుకు ఓకే చెప్పింది అనేది పుకార్ల సారాంశం. కానీ వార్తలన్నీ ఒట్టి గాలి వార్తలే అని అందులో నిజం లేదని అనసూయ తెలిపింది. దాంతో ఈ గాలి వార్తలకి చెక్ పడింది. ప్రస్తుతానికి అనసూయ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తోంది.

ఇది కాకుండా ఇటీవలే ఓ యంగ్ హీరో నటించనున్న రోడ్ ట్రిప్ మూవీ లో నలుగురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించేందుకు అనసూయని అప్రోచ్ అవ్వగా, చర్చల దశల ఉన్న ఈ ప్రాజెక్ట్ కి అనసూయ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇటీవలే టీవీ షూటింగ్స్ ప్రారంభించిన అనసూయ కరోనా కారణంగా జబర్దస్త్‌ షూటింగ్‌ కు కూడా హాజరు కాలేను అంటూ ఇటీవల అనసూయ క్లారిటీ ఇచ్చింది.


Advertisement

Recent Random Post:

Special Focus on YSRCP Manifesto 2024 | AP Elections 2024

Posted : May 3, 2024 at 12:06 pm IST by ManaTeluguMovies

Special Focus on YSRCP Manifesto 2024 | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement