Advertisement

ఎక్స్ క్లూజివ్: ఆహా కోసం మెగాస్టార్‌ క్లాసిక్‌ టైటిల్‌

Posted : July 23, 2020 at 10:48 pm IST by ManaTeluguMovies

అల్లు అరవింద్‌ ‘ఆహా’ కోసం పలు వెబ్‌ సిరీస్‌ లను నిర్మిస్తున్నాడు. ప్రముఖ దర్శకులతో ఆహా కోసం కంటెంట్‌ ను రూపొందించే పనిలో అల్లు అరవింద్‌ ఉన్నారు. ఆహా ప్రారంభం అయ్యి చాలా నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఒరిజినల్‌ కంటెంట్‌ చాలా తక్కువగా పెట్టారు. ప్రస్తుతం జనాలు ఓటీటీ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వరుసగా వెబ్‌ సిరీస్‌ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అల్లు అరవింద్‌ రెడీ అయ్యాడు.

ప్రముఖ దర్శకుడు రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌ కు ‘రుద్రవీణ’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారట. 1988లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘రుద్రవీణ’ చిత్రం సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. క్లాసిక్‌ మూవీ అయిన రుద్రవీణ టైటిల్‌ ను వెబ్‌ సిరీస్‌ కు పెట్టడంతో అందరి దృష్టి ఆకర్షించే అవకాశం ఉంది. లేడీ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ కు ఈ టైటిల్‌ పెడుతున్నారనే సమాచారం కూడా అందుతోంది.

పేరున్న దర్శకుడు రూపొందిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ లో గతంలో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ కీలక పాత్రలో కనిపించబోతుందని అలాగే ప్రముఖ నటీనటులు కూడా ఈ వెబ్‌ సిరీస్‌ లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే ఈ వెబ్‌ సిరీస్‌ ను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 || స్వతంత్రులకు, రెబల్స్ కు పెద్ద ఎత్తున గాజు గ్లాసు గుర్తు కేటాయింపు | EC

Posted : April 30, 2024 at 11:39 am IST by ManaTeluguMovies

AP Elections 2024 || స్వతంత్రులకు, రెబల్స్ కు పెద్ద ఎత్తున గాజు గ్లాసు గుర్తు కేటాయింపు | EC

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement