మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయినప్పటికీ మొదటి సినిమా నుంచి మెగా ఫ్యామిలీ హీరోస్ కి ఉన్న కమర్షియల్ హీరోస్ నే ట్యాగ్ ని కాకుండా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్. లాక్ డౌన్ ముందు వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఓ స్పోర్ట్స్ డ్రామాని మొదలు పెట్టారు. వైజాగ్ లో ఒక షెడ్యూల్ చేసాక లాక్ డౌన్ రావడంతో షూటింగ్ ఆగింది. కానీ ఈ సమయం మొత్తం తన ట్రైనర్ ని తనతోనే ఉంచుకొని ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాములుగా అందరూ నెగటివ్ గా చెప్పుకునే కొన్ని పాయింట్స్ తనకి ఈ బాక్సింగ్ సినిమా విషయంలో హెల్ప్ అయ్యిందని తెలిపాడు. ‘స్వతహాగా నేను అగ్రెసివ్ పర్సన్. అలాగే కాస్త షార్ట్ టెంపర్ కూడా ఎక్కువే. బాక్సింగ్ అనేది ఫైటింగ్ స్పోర్ట్ కాబట్టి ఆ రెండు క్వాలిటీస్ నాకు బాగా హెల్ప్ అయ్యాయి, సినిమాకి ఈజీగా కనెక్ట్ అవ్వగలిగాను. అలాగే బాక్సింగ్ వలన ఉన్న ప్రెషర్ పోవడమే కాకుండా ఎప్పుడూ ఫుల్ ఛార్జ్ గా ఉంటామని’ తెలిపాడు.
అలాగే ‘నిహారిక పెళ్ళికి ఐతే కాస్త టైం పడుతుందని, నిశ్చితార్ధం మాత్రం ఆగష్టులో ఉంటుందని’ వరుణ్ తేజ్ తెలిపారు. ఇటీవలే వరుణ్ తేజ్ బాక్సింగ్ మూవీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర వరుణ్ తేజ్ కి ఫాదర్ పాత్రలో కనిపించనున్నాడని తెలిపాము. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని అల్లు బాబీ నిర్మిస్తున్నారు.