Advertisement

శర్వానంద్ తో ఆసియన్ సినిమాస్

Posted : August 4, 2020 at 8:20 pm IST by ManaTeluguMovies

చకచకా అడ్వాన్స్ లు ఇస్తూ సినిమాలు ప్లాన్ చేస్తున్న ఆసియన్ సునీల్ మరో సినిమాను ప్రకటిస్తున్నారు. హీరో శర్వానంద్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఆసియన్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే నాగ్ చైతన్యతో సినిమా సగంలో వుంది. నాగశౌర్యతో విలువిద్య బ్యాక్ డ్రాప్ లో సినిమా ప్లానింగ్ లో వుంది.

నాగార్జున తో ప్రవీణ్ సత్తారు సినిమా వుంది. నిఖిల్ తో సినిమా ప్రకటించారు. ఇప్పుడు శర్వానంద్ తో సినిమా ప్రకటన వస్తోంది. అంటే మొత్తం అయిదు సినిమాలు అన్నమాట. ఇది కాక శేఖర్ కమ్ములతో మరో సినిమా వుండనే వుంది. ఇన్నాళ్లు దిల్ రాజు, మైత్రీ, సితార, జిఎ2 లాంటి సంస్థలే ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఆసియన్ సినిమాస్ సంస్థ కూడా ఈ లైన్ లోకి వచ్చింది.

ఆసియన్ సంస్థకు వందలాది థియేటర్లు చేతిలో వున్నాయి. వాటికి సినిమాలు అవసరం. డిస్ట్రిబ్యూషన్ కోసం వేరే వాళ్లతో పోటీ పడే కన్నా, ప్లాన్డ్ గా ఇలా సినిమాలు చేయడం బెటర్ అనేమో? ఇప్పటికే దిల్ రాజు ఇలాంటి ఐడియాతో వరుసగా సినిమాలు ఇటు స్వంతంగానూ, అటు ఇతరులకు ఫండింగ్ తోనూ చేస్తున్నారు. మొత్తానికి లాక్ డౌన్ అయిపోతే, వాక్సీన్ వచ్చేస్తే, చకచకా సినిమాలే సినిమాలు అన్నమాట.


Advertisement

Recent Random Post:

రైసీ దుర్మరణం వెనుక ఇజ్రాయిల్‌ కుట్ర ? | Israel Role Behind | Iran President Raisi’s Death | Rumors

Posted : May 21, 2024 at 12:58 pm IST by ManaTeluguMovies

రైసీ దుర్మరణం వెనుక ఇజ్రాయిల్‌ కుట్ర ? | Israel Role Behind | Iran President Raisi’s Death | Rumors

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement