ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత అక్కినేని తనను తాను కొత్తగా ఆవిష్కరింసుకోనున్నారు. అయితే సినిమాల్లో మాత్రం కాదు. తనకిష్టమైన వ్యాపార రంగంలో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టనున్నారు. వస్త్ర వ్యాపార రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆమె సిద్ధమయ్యారు.
అయితే సమంతకు వ్యాపార రంగం కొత్తేమీ కాదు. కానీ ఈ దఫా మరింత సీరియస్‌గా అందులో ఎఫెర్ట్ పెట్టనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో స్నేహితులతో కలిసి ఏక్కం అనే ఫ్రీ స్కూల్ బిజినెస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వస్త్ర వ్యాపార రంగాన్ని ఎంచుకున్నారు.
ఈ మేరకు సమంత ట్విటర్లో కొత్తగా ప్రారంభించనున్న వ్యాపారం గురించి వెల్లడించారు. సాకి వరల్డ్ పేరుతో తాను దుస్తుల వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు సమంత తెలిపారు. కొన్ని నెలలుగా సాకి వరల్డ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నానని ఆమె చెప్పారు. తన జర్నీలో ఫ్యాషన్‌పై తనకున్న ప్రేమను సాకి వరల్డ్ తెలియజేస్తుందని అక్కినేని నాగచైతన్య సతీమణి సమంత ట్వీట్ చేశారు.