Advertisement

తమన్‌పై కాపీ ఆరోపణలు.. ఇంద్రగంటి ఏమన్నాడంటే?

Posted : September 10, 2020 at 11:33 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై కాపీ ఆరోపణలు కొత్తవేమీ కావు. ‘బిజినెస్ మేన్’లోని చావ్ పిల్లా సహా ఎన్నో పాటల విషయంలో అతను కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనిపై గతంలో అతను ఎంతగా సమర్థించుకున్నా, బుకాయించినా చాలా వరకు అతడి ఇమేజ్ డ్యామేజ్ అయిన మాట వాస్తవం.

ఐతే గత రెండు మూడేళ్లుగా తమన్ సంగీతంలో చాలా మార్పు కనిపిస్తోంది. ఊకదంపుడు మ్యూజిక్ పక్కన పెట్టి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని మంచి ఆడియోలు అతడి నుంచి వచ్చాయి. వాటికి అద్భుతమైన స్పందనా వచ్చింది. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒక గౌరవం సంపాదించుకున్నాడతను.

ఇలాంటి టైంలో ‘వి’ సినిమాకు తమన్ అందించిన నేపథ్య సంగీతం విమర్శల పాలైంది. ‘రాక్షసన్’ సహా కొన్ని సినిమాల్లో విన్న బ్యాగ్రౌండ్ స్కోర్ డిట్టో ఇందులో వినిపించడంతో నెటిజన్లు అతడిపై పడిపోయారు. దీనిపై తమన్ ఇప్పటిదాకా స్పందించలేదు.

ఐతే ఈ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. తమన్‌ తరఫున వాదనకు రెడీ అయ్యాడు. తమన్ బీజీఎం కాపీ అంటూ వస్తున్న ఆరోపణలపై ట్విట్టర్లో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆయన వీడియో రూపంలో సమాధానం చెప్పారు. ఈ సినిమాకు మిక్సింగ్ జరిగిన అన్నపూర్ణ స్టూడియోలో పని చేసే ఒక టెక్నీషియన్ సైతం బ్యాగ్రౌండ్ స్కోర్ రిపీటైందంటూ అడిగాడని.. నిజానికి తమన్‌కు కాపీ కొట్టాల్సిన అవసరమే లేదని.. ‘రాక్షసుడు’ సినిమా నేపథ్య సంగీతానికి, ‘వి’లో వినిపించిందానికి తేడా ఉందని ఆయన అన్నారు.

జానర్‌ను బట్టి సంగీత దర్శకులు ఒక ప్యాటర్న్, సౌండ్స్ ఫాలో అవుతారని.. ఈ క్రమంలో ఒకే రకమైన వాయిద్యాల్ని వాడాల్సి రావచ్చని.. అలాంటపుడు సంగీతం ఒకేలా అనిపించడంలో ఆశ్చర్యం లేదని.. కానీ జాగ్రత్తగా వింటే తేడా అర్థమవుతుందని ఇంద్రగంటి అన్నారు.

తమిళ జనాలకు మ్యూజిక్ సెన్స్ బాగా ఉందని.. అక్కడ సామాన్య జనం సంగీతం నేర్చుకునే సంస్కృతి కొనసాగుతోందని.. తెలుగులో ఆ కల్చర్‌ను ఎప్పుడో చంపేశారని.. అందువల్ల సంగీతం మీద మన వాళ్లకు సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల కొంచెం సిమిలర్‌గా ఉన్న సౌండింగ్ వినగానే కాపీ అనేస్తున్నారని ఇంద్రగంటి చెప్పారు. ఇప్పుడు ‘వి’లో విన్న మ్యూజిక్‌కు.. ‘1 నేనొక్కడినే’ టైటిల్ కార్డ్స్ పడేటపుడే వినిపించే సౌండ్స్‌తోనూ పోలిక ఉంటుందని.. థ్రిల్లర్ జానర్‌ కోసం ప్రత్యేకంగా వాడే సౌండ్స్ వల్ల ఈ పోలిక కనిపిస్తుంది తప్ప కాపీ అనడానికి ఆస్కారమే లేదని ఆయన తేల్చేశారు.

తమిళంలో అంత పెద్ద హిట్టయిన ‘రాక్షసన్’ సినిమా నేపథ్య సంగీతాన్ని కాపీ కొడితే జనాలు క్షణాల్లో పట్టేస్తారని తమన్‌కు తెలియదా.. అసలు అతడికి ఆ అవసరమే లేదని అన్నారు ఇంద్రగంటి. ఈ వివరణ చూసిన తమన్.. సంగీత దర్శకులైన తాము కూడా మ్యూజిక్ గురించి ఇంత చక్కగా వివరించలేమంటూ తన తరఫున వాదన వినిపించిన ఇంద్రగంటికి థ్యాంక్స్ చెప్పాడు.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 14th September “2024

Posted : September 14, 2024 at 10:07 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 14th September “2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad