Advertisement

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 13 – గుంజీలు తీశారు, కొత్త కెప్టెన్‌ వచ్చాడు.!

Posted : September 19, 2020 at 8:32 pm IST by ManaTeluguMovies


మొన్నటి ఎపిసోడ్‌ లో జరగాల్సిన బిబి టీవీ కామెడీ షో ఆలస్యం అయ్యి నిన్నటి ఎపిసోడ్‌ లో టెలికాస్ట్‌ అయ్యింది. నిన్నటి ఎపిసోడ్‌ ప్రారంభంతోనే బిబి టీవీ కామెడీ షో ప్రారంభం అయ్యింది. కుమార్‌ సాయి టీం మొదట స్కిట్‌ చేసింది. దేవి, దివి, అమ్మ రాజశేఖర్‌, హారికలు డ్రామా కంపెనీ పెట్టుకుని తిండి లేక అలమటిస్తూ ఉండే స్కిట్‌. కామెడీ యావరేజ్‌ గా ఉన్నా అందుకు వారు పడ్డ కష్టం అభినందనీయం.

ఇక ఆ తర్వాత అవినాష్‌ టీం కరాటే కళ్యాణి, మోనాల్‌, సుజాత, అఖిల్‌ లు కలిసి ఒక స్కిట్‌ చేశారు. మూడు నిమిషాలు చేయాల్సింది అయిదు నిమిషాలు చేశారు. నవ్వు తెప్పించింది. ఈ రెండు స్కిట్‌ ల్లో అందరు సమాన ఓట్లు పడ్డాయి. అయితే గంగవ్వ నిర్ణయం మేరకు అవినాష్‌ టీంను విజేతగా ప్రకటించారు. అందుకు అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ హర్ట్‌ అయ్యాడు. ఇద్దరం బాగా చేశాం అంటే బాగుండేది. చాలా కష్టపడి చేసినా ఏంటీ ఈ ప్రతిఫలం అంటూ రాజశేఖర్‌ మాస్టర్‌ అసహనం వ్యక్తం చేయడంతో కొంత సమయం ఇంట్లో గందరగోళ వాతావరణం మొదలైంది. రెండు టీమ్‌ లకు డ్రింక్‌ పంపడంతో అంతా కూల్‌ అయ్యింది.

ఇంటి సభ్యులు పదే పదే రూల్స్‌ అతి క్రమిస్తున్నారు అంటూ బిగ్‌ బాస్‌ సీరియస్‌ అయ్యాడు. గుంజీలు తీయించడంతో పాటు తెలుగు నేర్చుకోండి అంటూ శిక్ష విధించాడు. అది సరదాగా సాగి పోయింది. ఇక బిబి టీవీ బెస్ట్‌ ఫెర్ఫార్మర్స్‌ నలుగురు ఎంపిక చేసి అందులో ఒక్కరిని కెప్టెన్‌ గా ఎంపిక చేసుకోవాలంటూ సూచించారు. అభిజిత్‌, కళ్యాణి, నోయల్‌, మెహబూబ్‌లు కెప్టెన్సీ కి పోటీ పడగా అందరు ఏకాభిప్రాయంతో నోయల్‌ ను కెప్టెన్‌ గా చేశారు.

నిన్నటి ఎపిసోడ్‌ లో టీవీ9 దేవి రెండు సందర్బాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటిది తనను కెప్టెన్‌ సెక్షన్‌లోకి రానివ్వడం లేదు అని లాస్యతో తగువు పెట్టుకుంది. ఆ తర్వాత నోయల్‌ కెప్టెన్‌ గా పనులు అసైన్‌ చేస్తున్న సమయంలో కూడా అమ్మరాజశేఖర్‌ తో దేవి వాగ్వివాదంకు దిగింది. మీరు వాయిస్‌ పెంచకండి అంటూ ఆయన్ను హెచ్చరించింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో పులిహోర సీన్స్‌ పెద్దగా కనిపించలేదు.


Advertisement

Recent Random Post:

అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం | Rs 15,000 Crore Loan to AP Capital Amaravati

Posted : November 12, 2024 at 1:41 pm IST by ManaTeluguMovies

అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం | Rs 15,000 Crore Loan to AP Capital Amaravati

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad