Advertisement

బిగ్ బాస్ 4: గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో కరెక్టేనా?

Posted : September 23, 2020 at 9:53 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ 4 కు స్పెషలిటీ తీసుకొచ్చింది కచ్చితంగా గంగవ్వ. 60 ఏళ్ల వయసులో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం నిజంగా విశేషమే. యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ షో ద్వారా గంగవ్వ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు గంగవ్వ పెర్ఫార్మన్స్ బట్టి చూస్తుంటే ఆమె నిజంగా హౌస్ లో అవసరమా అనే వాదనలు వినిపిస్తున్నాయి. గంగవ్వ షో లో ఉండే విషయమై భిన్న వాదనలు జరుగుతున్నాయి.

గంగవ్వ ఫిజికల్ టాస్క్ లు చేయలేరు. ఆమె వయసు అడ్డంకి కచ్చితంగా కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఆమె పెద్దగా సాధించింది కూడా లేదు. అయితే గంగవ్వ మై విలేజ్ షో లో వీడియోస్ ద్వారా ఎంత ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనేది అందరికీ తెల్సిందే. అయితే అదంతా స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేసిందే. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు ఉండరు. పైగా బిగ్ బాస్ లో గంగవ్వకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి.

నిన్నటి టాస్క్ తీసుకుంటే గంగవ్వ వల్ల హ్యూమన్స్ ఆడలేము అని అన్నారు. ఎందుకంటే గంగవ్వ రోబోట్స్ ఎగ్స్ వద్ద నిలబడింది. ఆమెతో ఫిజికల్ గా పోటీ పడము అని చెప్పేసారు. గంగవ్వ కూడా పలుమార్లు నేను హౌస్ లో నుండి వెళ్ళిపోతాను అన్నట్లే మాట్లాడుతోంది. ఈ కారణాలతో బిగ్ బాస్ హౌస్ కు గంగవ్వ కరెక్ట్ కాదు అని అంటున్నారు.

మరి గంగవ్వ విషయంలో బిగ్ బాస్ ఏం చేస్తుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

Prakash Raj Sensational Tweet On Deputy CM Pawan Kalyan | Hero Karthi

Posted : September 25, 2024 at 10:01 pm IST by ManaTeluguMovies

Prakash Raj Sensational Tweet On Deputy CM Pawan Kalyan | Hero Karthi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad