సుశాంత్ మృతి చెందిన తర్వాత ఆయనకు చెందిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కనిపించిన జీవితం కంటే కనిపించని జీవితం చాలా ఉందని మీడియా కథనాలు మరియు సీబీఐ ఎంక్వౌరీలో వెళ్లడి అవుతుంది. సుశాంత్ మృతి చెందిన తర్వాత ఆయన అభిమానులు ఆయన మృతికి కారణం రియా చక్రవర్తి అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఎంక్వౌరీ చేయాలంటూ సీబీఐ విచారణ కోరడంతో ఇటీవల ఆమెను ఎంక్వౌరీ చేయడం జరిగింది. సీబీఐ ఎంక్వౌరీలో రియాకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని వెళ్లడి అయ్యింది. ఈ కేసులో దీపిక పదుకునే, రకుల్, సారా అలీ ఖాన్, శ్రదా కపూర్లను కూడా విచారించారు.
డ్రగ్స్ కేసుతో సుశాంత్ మృతి కేసు ముడి పడి ఉన్న కారణంగా రెండు కేసులను సమాంతరంగా ఎంక్వౌరీ చేస్తున్నారు. ఇటీవల సారా అలీ ఖాన్ ను ఎన్ సీ బీ అధికారులు విచారించారు. ఆ సందర్బంగా వారి వద్ద సారా తాను సుశాంత్‌ను ప్రేమించిన మాట వాస్తవమే. అతడితో కలిసి చాలా సార్లు సిగరెట్లు కాల్చాను. కాని నేను ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదు. సుశాంత్ తో థాయిలాండ్ వెళ్లిన సమయంలో కూడా తాను కేవలం సిగరెట్లు తాగాను తప్ప డ్రగ్స్ తీసుకోలేదు అంటూ ఆమె చెప్పిందని జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.
హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు అవ్వడం వల్ల సారాకు మంచి గుర్తింపు ఉంది. దాంతో బాలీవుడ్ పార్టీలకు పబ్ లకు తిరుగుతూ ఉండేది. ఆ క్రమంలో సుశాంత్ తో ప్రేమలో పడిందట. అయితే కొన్నాళ్ల పాటే వీరిద్దరి మద్య వ్యవహారం సాగింది. ఆ తర్వాత రియాతో సుశాంత్ ప్రేమలో పడ్డాడు. సుశాంత్ ను ఒకప్పుడు ప్రేమించిన సారా అలీ ఖాన్ ఈ కేసు నుండి బయట పడ్డట్లేనా లేదా మళ్లీ విచారణకు హాజరు అవ్వాలా అనేది త్వరలో తెలియనుంది.