Advertisement

అనుష్క నిశ్శబ్దం విషయంలో కావాలనే అలా చేస్తోందా..?

Posted : September 29, 2020 at 3:58 pm IST by ManaTeluguMovies

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2న విడుదల కానున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాను హేమంత్ మధుకర్ తెరకెక్కించగా కీలక పాత్రల్లో మాధవన్, అంజలి, షాలిని పాండే నటించారు. ఏదైనా సినిమా థియేట్రికల్ రిలీజ్ ఉందంటే దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలుసు.

అయితే ఓటిటి ద్వారా విడుదలయ్యే సినిమాల్లో ఆ తరహా పద్దతి కనిపించట్లేదు. ప్రమోషన్స్ చాలా వీక్ గా కనిపిస్తున్నాయి. సినిమాను అమ్మేసాం ఇక దాంతో మనకు పనిలేదు అన్న తరహా ధోరణి కనిపిస్తోంది. అయితే నాని నటించిన వి ఇందుకు కొంత మినహాయింపు. ఎందుకంటే వి విషయంలో నాని, సుధీర్ బాబు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి తదితరులు ప్రమోషన్స్ గట్టిగానే చేసారు. అందుకే నెగటివ్ టాక్ వచ్చినా కానీ వి అమెజాన్ ప్రైమ్, భారీ నష్టాలను అయితే తీసుకురాలేదు.

కానీ నిశ్శబ్దం రిలీజ్ కు ముందు టైటిల్ కు తగ్గట్లే చాలా నిశ్శబ్దంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ అనుష్క శెట్టి ఈ సినిమాను ప్రమోట్ చెయ్యట్లేదు. అనుష్క అనే కాదు ఈ సినిమాకు పనిచేసిన ఎవరూ కూడా ప్రమోషన్స్ అన్నదే చెయ్యట్లేదు. అనుష్కకు ఈ సినిమా ఓటిటిలో విడుదల కావడం ఇష్టం లేదని, అందుకే ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోందని అంటున్నారు.


Advertisement

Recent Random Post:

పవన్ విషయంలో వైసీపీ ఫీల్ అవుతుందా..? ఆ భయం పార్టీలో ఉందా..? | YCP | Janasena | OTR

Posted : September 19, 2024 at 9:49 pm IST by ManaTeluguMovies

పవన్ విషయంలో వైసీపీ ఫీల్ అవుతుందా..? ఆ భయం పార్టీలో ఉందా..? | YCP | Janasena | OTR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad