‘‘శరీరంలోని అన్ని అవయవాల్లో కళ్లు చాలా ప్రధానమైనవి. కళ్లతో చూస్తాం.. మాట్లాడతాం. అనంత సృష్టిలో ఉన్న దాన్ని కళ్లతో చూసి ఆనందిస్తాం. అలాంటి ఒక అద్భుతమైన వరాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మనం మరణించిన తర్వాత మన కళ్లు వృథాగా పోకుండా నేత్రదానం చేసినట్లయితే మన రెండు కళ్లు నలుగురికి ఉపయోగపడతాయి. మరణించిన తర్వాత కూడా బతికుండాలంటే మనం నేత్రదానం చేద్దాం’’ అన్నారు బ్రహ్మానందం.
ఇంకా మాట్లాడుతూ –‘‘మనం చనిపోయాక వ్యర్థ పదార్థంలా మట్టిలో కలిసిపోవడం కంటే మనలోని అవయవాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయంటే అంతకంటే కావాల్సింది ఏముంది. ఒక్క గుండె ఉంటేనే సరిపోదు.. కళ్లు కూడా ఎంతో ముఖ్యం. ‘కార్నియా అంధత్వ్ ముక్త్ భారత్ అభ్యాన్’ ద్వారా ‘సాక్షం సేవ’ అనే సంస్థవారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.. ఇందుకు వారికి హ్యాట్సాఫ్’’ అన్నారు బ్రహ్మానందం.