Advertisement

నీళ్ళలో నిప్పులు: కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ చల్లార్చినట్లేనా.?

Posted : October 6, 2020 at 11:01 pm IST by ManaTeluguMovies

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీళ్ళ పంపకాల వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లేనా.? అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఇప్పుడు అంశంపై ఇరు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కృష్ణా బోర్డుని ఆంధ్రప్రదేశ్‌కి తరలించేందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారట. అంటే, ఇక్కడికి ఓ వివాదం సద్దుమణిగినట్లే. కానీ, నీటి పంపకాల మాటేమిటి.? పంపకాల్ని ట్రైబ్యునల్‌ తేల్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారట.

అయితే, కొత్త కేటాయింపుల అవసరమేముందన్నది ఆంధ్రప్రదేశ్‌ వాదనగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అనేది దిగువ రాష్ట్రం గనుక.. మిగులు జలాలపై పూర్తి హక్కు ఆంధ్రప్రదేశ్‌దే. కానీ, ఇక్కడే పంచాయితీ నడుస్తోంది. గతంలో మిగులు జలాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికే చెందేవనీ.. ఆ లెక్కన, వాటిల్లో భాగం తెలంగాణకీ దక్కుతుందని తెలంగాణ వాదిస్తోంది. కానీ, అంశాలపై గజేంద్ర షెకావత్‌ స్పందించలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమకు అప్పగించాలని తెలంగాణ కోరితే, ఆ విషయాన్ని కోర్టులు నిర్దేశిస్తాయని షెకావత్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఎలా చూసినా, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం విషయమై తెలంగాణకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా కనిపించలేదు. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌ కొంత మేర తన వాదనలకు మద్దతు కూడగట్టుకోగలిగింది. ఇరు రాష్ట్రాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్థించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ కోరారు. దీనికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అంగీకరించారట. నదీ జలాల పంపిణీపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ని తెలంగాణ ఉపసంహరించుకోవడానికి సిద్ధమని కేసీఆర్‌ చెప్పారట. ఇది ఇంకో కీలకమైన అంశం కాబోతోంది.

మొత్తమ్మీద, ప్రధాని నరేంద్ర మోడీతో ఈ రోజు ఉదయం భేటీ అయిన వైఎస్‌ జగన్‌.. కొంతమేర అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పై చేయి సాధించగలిగారని నిస్సందేహంగా చెప్పొచ్చు. గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంపై తెలంగాణ నుంచి ఎలాంటి వివరణ వస్తుందో వేచి చూడాల్సిందే.


Advertisement

Recent Random Post:

నీటిపై తేలియాడే విమానం! | Vijayawada-Srisailam Sea Plane Trial Run Conducted Successfully

Posted : November 8, 2024 at 9:59 pm IST by ManaTeluguMovies

నీటిపై తేలియాడే విమానం! | Vijayawada-Srisailam Sea Plane Trial Run Conducted Successfully

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad