Advertisement

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 31 – హోటల్‌ టాస్క్‌ లో అవినాష్‌ సీక్రెట్‌ టాస్క్‌ ఫుల్‌ కామెడీ

Posted : October 7, 2020 at 12:36 pm IST by ManaTeluguMovies

తెలుగు బిగ్‌ బాస్‌ అయిదవ వారం కెప్టెన్సీ టాస్క్‌ లో భాగంగా బిబి హోటల్‌ టాస్క్‌ ను ఇంటి సభ్యులకు ఇచ్చాడు. ఆ టాస్క్‌ లో భాగంగా అవినాష్‌ కు సీక్రెట్‌ టాస్క్‌ ను కూడా బిగ్‌ బాస్‌ ఇచ్చాడు. ఇప్పటికే ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తున్న అవినాష్‌ సీక్రెట్‌ టాస్క్‌ లో మరింత రెచ్చి పోయాడు. చాలా నాచురల్‌ గా ఎవరికి అనుమానం రాకుండా సీక్రెట్‌ టాస్క్‌ ను చేస్తున్నాడు. అతడు చేస్తున్న పనులు అందరికి నవ్వు తెప్పిస్తున్నాయి. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ సరదాగా సాగి పోయింది.

బిబి హోటల్‌ టాస్క్‌ ప్రారంభంకు ముందు సోమవారం ఎపిసోడ్‌ తాలూకు చర్చ కొనసాగింది. దివి అవమానించినట్లుగా మాట్లాడటంతో లాస్య వెక్కి వెక్కి ఏడుస్తుండగా గంగవ్వ ఓదార్చింది. ఆ తర్వాత మోనాల్‌ ను అభిజిత్‌ మరియు అఖిల్‌ లు ఓదార్చి సారీ చెప్పారు. ఇక సోహెల్‌ తనను నామినేట్‌ చేయడంను అమ్మ రాజశేఖర్‌ తట్టుకోలేక పోయాడు.

ఎలిమినేషన్‌ చర్చ జరుగుతున్న సమయంలోనే బిబి హోటల్‌ టాస్క్‌ వచ్చింది. అవినాష్‌ ను కన్ఫెషన్‌ రూంకు పిలిచిన బిగ్‌ బాస్‌ హోటల్‌ టాస్క్‌ కు సంబంధించిన లేఖ పంపించడంతో పాటు ఒక జట్టులో ఉండి మరో జట్టు వియానికి తోడ్పడే సీక్రెట్‌ టాస్క్‌ ను అవినాష్‌ చేయాల్సి ఉంటుందని బిగ్‌ బాస్‌ సూచించాడు. ఈ టాస్క్‌ లో ఫెయిల్‌ అయినట్లయితే కెప్టెన్సీ పోటీ దారుడిగా ఉండే అవకాశం ఉండదు. ఈ టాస్క్‌ గురించి చెప్పినట్లయితే పరిణామాలు సీరియస్‌ గా ఉంటాయని కూడా బిగ్‌ బాస్‌ హెచ్చరించాడు. ఇక టాస్క్‌ లో భాగంగా బిబి హోటల్‌ స్టాఫ్ గా అభిజిత్‌, అఖిల్‌, లాస్య, సుజాత, అమ్మ రాజశేఖర్‌, అవినాష్‌, దివి మరియు మోనాల్‌ లు వ్యవహరించగా హోటల్‌ కు వచ్చే గెస్ట్‌ లుగా మెహబూబ్, సోహెల్‌, హారిక, గంగవ్వ మరియు అరియానాలు వ్యవహరించాల్సి ఉంటుంది. వచ్చిన గెస్ట్‌లు తమకు అందిన సేవలకు గాను స్టార్స్‌ ను ఇవ్వాల్సి ఉంటుంది. టాస్క్‌ లో భాగంగా గెస్ట్‌ లు హోటల్‌ సిబ్బందిని విసిగిస్తూ సేవలు పొందాలి. సిబ్బంది గెస్ట్‌ లవద్ద డబ్బులు సంపాదించి 5 స్టార్స్ ను దక్కించుకోవాల్సి ఉంటుంది.

అవినాష్ సీక్రెట్‌ టాస్క్‌ లో భాగంగా హారికను అవమానించాడు, ప్రిన్సెస్‌ అయిన అరియానాను చేయి పట్టుకోవడంతో పాటు ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక చివరకు అతిధుల కోసం వండుతున్న వంటలో చాలా ఉప్పు పడేశాడు. ఇక మరో వైపు అభిజిత్‌ ఇంటి సభ్యులు ఇవ్వాల్సిన 5 స్టార్స్‌ ను ఇప్పటికే తన వద్ద ఉంచేసుకున్నాడు. వాటిని తమ వద్దే ఉంచుకుని అవినాష్‌ గేమ్‌ ప్లే చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌ లో టాస్క్‌ సరదాగా సాగింది. మరి నేటి ఎపిసోడ్‌ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ప్రోమోలో అమ్మ రాజశేఖర్‌ ఏదో పనిస్మెంట్‌ పొందినట్లుగా ఉన్నాడు. అభిజిత్‌ కూడా నేటి ఎపిసోడ్‌ లో పనిష్మెంట్‌ ను తీసుకోవాల్సి ఉంటుందని ప్రోమోలో చూపించారు. నేడు ఏం జరుగుతుందో ప్రేక్షకుల్లో ఆసక్తిగా ఉంది.


Advertisement

Recent Random Post:

Stock Market Crash: Investors lose over Rs 3 lakh crore

Posted : October 1, 2024 at 12:40 pm IST by ManaTeluguMovies

Stock Market Crash: Investors lose over Rs 3 lakh crore

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad