Advertisement

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కి ఇక టెన్షన్ లేనట్టేనా.?

Posted : October 9, 2020 at 12:09 pm IST by ManaTeluguMovies

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రానున్న భారీ బడ్జెట్ ఫిలిమ్స్ లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. తెలుగు స్టార్ హీరోస్ ఎన్.టి.ఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, ఒలీవియా మోరిస్ లతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ లాంటివారు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి.

కోవిడ్ కారణంగా దాదాపు 6 నెలల పాటు షూటింగ్ ఆపేసిన ఈ చిత్ర టీం రీసెంట్ గా షూటింగ్ ని ప్రారంభించడమే కాక అక్టోబర్ 22న ఎన్.టి.ఆర్ టీజర్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కోవిడ్ వల్ల షూటింగ్ ఆగిపోయే టైంకి అలియా భట్ – రామ్ చరణ్ తో చేయనున్న పూణే షెడ్యూల్ కి అన్నీ సిద్ధం చేశారు. అప్పటికే అలియా భట్ డేట్స్ సమస్య వల్ల తన షెడ్యూల్స్ గతంలో రెండు సార్లు కాన్సల్ అయ్యాయి. తను డేట్స్ ఇచ్చేటప్పటికి కోవిడ్ రూపంలో మరో సమస్య వచ్చింది.

షూటింగ్ మొదలైనప్పటికీ అలియా భట్ డేట్స్ వలన మళ్ళీ షూటింగ్ ఆలస్యం అవుతుందేమో అనుకున్నారు. కానీ అలియా మాత్రం ఈ సారి ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ ఛాయస్ గా తీసుకున్నారు. అందుకే ఎన్.టి.ఆర్ టీజర్ కి సంబందించిన అన్ని షాట్స్, చరణ్ – తారక్ కాంబినేషన్స్ సీన్స్ ఈ నెలాఖరులోగా ఫినిష్ చేయనున్నారు. నవంబర్ నుంచి జరిగే షెడ్యూల్ లో అలియా భట్ జాయిన్ కానుంది. అలాగే తన షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకూ అలియా భట్ హైదరాబాద్ లోనే ఉండనుంది. దీని ప్రకారం ఈ సారి ఎవరి కారణంగా షూటింగ్ ఆగకుండా పగడ్బందీగా ప్లాన్ చేశారు. కావున వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కావడం పక్క అని ఈ చిత్ర టీం అంటోంది.


Advertisement

Recent Random Post:

కల్తీ నెయ్యి పై సుప్రీంకోర్టు ఏం చెప్పింది..? | Supreme Court on Adulterated Ghee

Posted : October 1, 2024 at 1:35 pm IST by ManaTeluguMovies

కల్తీ నెయ్యి పై సుప్రీంకోర్టు ఏం చెప్పింది..? | Supreme Court on Adulterated Ghee

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad