Advertisement

బిగ్ బాస్4: ఎపిసోడ్ 33-హోటల్‌ గెలిచిన ధనికులు, కెప్టెన్సీ టాస్క్ విన్నర్‌ సోహెల్

Posted : October 9, 2020 at 1:20 pm IST by ManaTeluguMovies

బిబి హోటల్‌ టాస్క్‌ నిన్నటితో ముగిసింది. హోటల్‌ సిబ్బంది టీం మరియు ధనికుల టీం మద్య సాగిన పోటీ అంత ఆసక్తికరంగా సాగలేదు. సాదా సీదాగా సాగిన ఈ టాస్క్‌ లో ధనికుల టీం హోటల్‌ టీం వారు ఇచ్చే మర్యాదలను బట్టి స్టార్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ధనికుల టీం స్టార్స్‌ ఇవ్వకుండానే అభిజిత్‌ స్టార్స్‌ దగ్గర పెట్టుకుని గేమ్‌ ఆడాడు. తమకు అయిదు స్టార్స్ వచ్చినట్లే అంటూ అభిజిత్‌ అనుకున్నాడు. టాస్క్‌ చివరి రోజు అయిన నిన్న కూడా బాగా ఏమీ సాగలేదు. ఇక ఈ ఆట ఇంతటితో ముగించేద్దామనుకున్న బిగ్‌ బాస్‌ అనౌన్స్‌ చేశాడు. రెండు టీమ్‌ లు కూడా లీవింగ్‌ రూమ్‌ లో కూర్చుని ఉండగా మొదట హోటల్‌ సిబ్బంది టీం ను మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయంటూ ప్రశ్నించగా మాకు అయిదు పాయింట్లు వచ్చాయంటూ అభిజిత్‌ ప్రకటించడం.. దాన్ని ధనికుల టీం మెంబర్స్‌ కొట్టిపారేయడం జరిగింది. చాలా సేపు చర్చ తర్వాత బిగ్‌ బాస్‌ హోటల్‌ సిబ్బందికి ధనికులు ఒకే స్టార్‌ ఇచ్చిన కారణంగా ధనికుల టీం గెలిచినట్లుగా ప్రకటించారు.

ధనికుల టీంలో ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన వారిని ఒకరిని ఎంపిక చేయాల్సిందిగా సూచించగా అందులో కూడా చాలా సమయం చర్చ జరిగింది. చివరకు సోహెల్‌ మరియు మెహబూబ్‌ ల మద్య పోటీ నెలకొంది. సోహెల్‌ ఈసారికి నా కోసం ఇచ్చేయ్యరా అంటూ విజ్ఞప్తి చేయగా మొదట ఒప్పుకోని మెహబూబ్‌ కొద్ది సమయం తర్వాత అరియానా ఎంటర్‌ అవ్వడంతో సరే నా మద్దతు కూడా సోహెల్‌ కే అంటూ ప్రకటించాడు. దాంతో కెప్టెన్సీకి పోటీ పడేందుకు సోహెల్‌ ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత సిబ్బంది టీంలో అత్యధిక టిప్పు దక్కించుకున్న అఖిల్‌ కు కూడా కెప్టెన్సీ పోటీలో నిల్చే అవకాశం దక్కింది. సీక్రెట్‌ టాస్క్‌ ను గెలిచిన అవినాష్‌ కు కూడా కెప్టెన్సీ టాస్క్‌ ఛాన్స్‌ దక్కింది.

ఈ ముగ్గురుకి నిప్పు ఐస్‌ టాస్క్‌ ను బిగ్‌ బాస్‌ ఇచ్చారు. వెనుకాల నిప్పులు ఉంటాయి. వంగి చేతిలో ఐస్‌ పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ సమయం వంగి ఐస్‌ పట్టుకుని ఉంటారో వారు కెప్టెన్‌ గా ఎంపిక అవుతారు. మొదట అఖిల్‌ తప్పుకోగా అవినాష్‌ ఆ తర్వాత తప్పుకున్నాడు. చివరకు సోహెల్‌ విజేతగా నిలిచాడు. బిగ్‌ బాస్‌ ఈవారం ఇంటి కెప్టెన్‌ గా సోహెల్‌ నిలిచాడు.


Advertisement

Recent Random Post:

ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే వదిలిపెట్టం : KTR Warns Konda Surekha | TG Politics

Posted : October 5, 2024 at 9:05 pm IST by ManaTeluguMovies

ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే వదిలిపెట్టం : KTR Warns Konda Surekha | TG Politics

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad