Advertisement

ఎక్స్ క్లూజివ్: రాశికి తెలుగులో వర్కౌట్ అవుతుందా?

Posted : October 9, 2020 at 3:34 pm IST by ManaTeluguMovies

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. ఆనతి కాలంలోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. గతేడాది అయితే వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాలతో వారం రోజుల్లోనే రెండు సూపర్ హిట్స్ ను అందుకుంది. అయితే ఈ ఏడాది చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆమె కెరీర్ ను పెద్ద దెబ్బ తీసిందని చెప్పాలి. నిజానికి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ముందు ఆమె ఈ పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పింది. తన కెరీర్ లో చాలా స్పెషల్ రోల్ ఇదని భావించింది. అందుకే ఈ సినిమా రిలీజ్ కు ముందు వేరే సినిమాలు ఒప్పుకోలేదు.

అయితే వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడమే కాదు, ఆమె రోల్ కు కూడా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆమె పాత్రను అందరూ విమర్శించారు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత తన దశ మారుతుంది అనుకుంటే ఇప్పుడు తెలుగులో సినిమా అన్నదే లేకుండా పోయింది.

రాశి ఖన్నా ఇప్పుడు తన ఫిజిక్ మీద దృష్టి పెట్టి బాగా సన్నపడింది. తన ఇన్స్టాలో పెట్టిన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయినా కానీ రాశికి తెలుగులో అవకాశాలు మాత్రం రావట్లేదు. తమిళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది రాశి. మరి ఆ సినిమాలతో తన దశ ఏమైనా తిరుగుతుందేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Pawan Kalyan Tirupati Varahi Meeting : సీక్రెట్స్ ఆఫ్ పవన్ ‘రెడ్ బుక్’ | Varahi Declaration Book

Posted : October 3, 2024 at 11:56 am IST by ManaTeluguMovies

Pawan Kalyan Tirupati Varahi Meeting : సీక్రెట్స్ ఆఫ్ పవన్ ‘రెడ్ బుక్’ | Varahi Declaration Book

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad