Advertisement

హెల్త్‌ బులిటెన్‌: జీవిత డిశ్చార్జ్, నిలకడగా రాజశేఖర్

Posted : October 24, 2020 at 6:08 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ రాజశేఖర్‌ కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. ఆయనతో పాటు భార్య మరియు పిల్లలకు కరోనా పాజిటివ్‌ అంటూ చాలా రోజుల క్రితమే నిర్థారణ అయ్యింది. ఇద్దరు పిల్లలకు మొదట కరోనా నెగటివ్‌ అంటూ వచ్చింది. వారికి పెద్దగా లక్షణాలు లేకుండానే కరోనాను జయించారు. జీవిత కాస్త ఇబ్బంది పడ్డా ఆమె పూర్తి ఆరోగ్యంతో కరోనాను జయించింది. కరోనా నుండి బయట పడ్డ జీవిత మరియు పిల్లలు డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి చేరారు. కాని రాజశేఖర్ మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు.

ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్‌ గా ఉన్నట్లుగా రెండు రోజుల క్రితం స్వయంగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నేడు ఆయనకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్న సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రి వారు అధికారికంగా హెల్త్‌ బులిటెన్‌ ను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం రాజశేఖర్‌ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జీవిత కరోనా నెగటివ్‌ అంటూ రావడంతో ఆమెను డిశ్చార్జ్‌ చేశామన్నారు. ప్రస్తుతానికి రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హెల్త్‌ బులిటెన్‌ లో పేర్కొన్నారు.


Advertisement

Recent Random Post:

Fun & Fierce Full Interview #Devara | NTR, Koratala Siva, Siddhu Jonnalagadda, Vishwaksen | Sep27

Posted : September 20, 2024 at 2:13 pm IST by ManaTeluguMovies

Fun & Fierce Full Interview #Devara | NTR, Koratala Siva, Siddhu Jonnalagadda, Vishwaksen | Sep27

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad