Advertisement

ఎక్స్ క్లూజివ్: పార్టీకి నిరాకరిస్తోన్న కాజల్… కారణమిదే!!

Posted : October 28, 2020 at 12:54 pm IST by ManaTeluguMovies

చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళికి ఇక ఎన్నో రోజులు లేదు. అక్టోబర్ 31న కాజల్ అగర్వాల్ పెళ్లి జరుగుతోంది. తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును కాజల్ పెళ్లి చేసుకోనుందన్న విషయం తెల్సిందే. ప్రస్తుతమున్న కోవిద్ పరిస్థితుల నేపథ్యంలో కాజల్ అగర్వాల్ పెళ్లిను ఎక్కువ హడావిడి లేకుండా జరగనుంది. కాజల్, గౌతమ్ ల దగ్గర బంధువులు కేవలం 20 మంది మాత్రమే పెళ్ళికి హాజరు కానున్నారు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించిన పనులు ఓ కొలిక్కి వచ్చాయి.

ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఉన్న కాజల్ స్నేహితులు ఆమెను పార్టీ అడిగినట్లుగా తెలుస్తోంది. పెళ్లికి రాలేరు కాబట్టి ప్రీ-వెడ్డింగ్ పార్టీ అరేంజ్ చేయమని కోరారట. గత దశాబ్దన్నరగా హైదరాబాద్ తో కాజల్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఉన్న కాజల్ అగర్వాల్ కు ఇక్కడ చాలా మంది స్నేహితులే ఉన్నారు.

అయితే ప్రీ వెడ్డింగ్ పార్టీకు కాజల్ అగర్వాల్ స్ట్రిక్ట్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి కూడా కోవిద్ కారణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ చేసుకోవడం అంత మంచిది కాదనే అభిప్రాయం కాజల్ వ్యక్తపరిచింది. అయితే పరిస్థితులు అన్నీ సద్దుమణిగాక కాజల్ ఇండస్ట్రీ స్నేహితులకు ఏమైనా ట్రీట్ ఇస్తుందేమో చూడాలి.

Share


Advertisement

Recent Random Post:

Pawan Kalyan భీమ్లా నాయక్ ర్యాప్ తో అదరగొట్టిన రోల్ రైడా | Rap Singer Roll Rida Fun Chit Chat

Posted : September 18, 2024 at 12:16 pm IST by ManaTeluguMovies

Pawan Kalyan భీమ్లా నాయక్ ర్యాప్ తో అదరగొట్టిన రోల్ రైడా | Rap Singer Roll Rida Fun Chit Chat

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad