Advertisement

కొత్త సినిమాను మొదలుపెట్టిన నాగ శౌర్య

Posted : October 28, 2020 at 2:14 pm IST by ManaTeluguMovies

యంగ్ హీరో నాగ శౌర్య ప్లాపుల్లో ఉన్నా కానీ వరసగా సినిమాలను సెట్ చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. నాగ శౌర్య నటించిన రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్నాయి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగ శౌర్య సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆర్చర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఇప్పటికే సింగిల్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అలాగే మరోవైపు లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో మరో సినిమాను మొదలుపెట్టాడు. రీతూ వర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఇటీవలే నాగ శౌర్య తన నెక్స్ట్ సినిమా వివరాలను బయట పెట్టిన విషయం తెల్సిందే. అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తాను సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రం ఈరోజు లాంచ్ అయింది. నాగ శౌర్య – అనీష్ కృష్ణ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి తెరకెక్కిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చనున్నాడు.

ఈ చిత్ర లాంచ్ కార్యక్రమానికి కొరటాల శివ, నారా రోహిత్, అనిల్ రావిపూడిలు ఈ చిత్ర లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు.


Advertisement

Recent Random Post:

Sattam En Kayil – Official Teaser | Sathish, Vidhya Pradeep, Mime Gopi | Chachhi | M.S.Jones Rupert

Posted : September 14, 2024 at 8:54 pm IST by ManaTeluguMovies

Sattam En Kayil – Official Teaser | Sathish, Vidhya Pradeep, Mime Gopi | Chachhi | M.S.Jones Rupert

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad