Advertisement

నిహారిక పెళ్లి – కట్నకానుకలు మరీ ఈ రేంజ్ లోనా?

Posted : November 19, 2020 at 11:38 pm IST by ManaTeluguMovies

సెలెబ్రిటీల వివాహమంటే సామాన్యులకు ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, గెస్ట్ లు ఎవరెవరు వస్తున్నారు? కట్నకానుకలుగా ఏమేమి ఇవ్వబోతున్నారు అంటూ పెద్ద లిస్ట్ ఉంది. వీటిపై రకరకాల ఊహాగానాలు రావడం సర్వసాధారణమైన విషయం.

గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, కాజల్ వంటి సెలెబ్రిటీల వివాహాల నేపథ్యంలో ఈ కట్నకానుకలపై రకరకాల రూమర్లు షికార్లు చేసాయి. అయితే వీటిలో ఎంత వరకూ నిజానిజాలు ఉంటాయో ఎవరికీ తెలీదు కానీ వినడానికి, ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఈ రూమర్స్ భలే ఆసక్తిగా అనిపిస్తాయి.

వచ్చే నెల 9న నాగబాబు కూతురు నిహారిక పెళ్లి జరగనున్న విషయం తెల్సిందే. ఉదయ్ పూర్ లోని ఒక ప్యాలెస్ లో ఈ వివాహం ఆర్భాటంగా జరగనుంది. ప్రస్తుతం నిహారిక అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి కొడుకు చైతన్య జొన్నలగడ్డకు, వారి కుటుంబానికి కట్నకానుకలుగా నాగబాబు కుటుంబం భారీగానే సమర్పిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పెళ్ళికి దాదాపు 10 కోట్ల రూపాయలను లాంఛనాల కింద పెళ్లి కొడుకు కుటుంబానికి ఇస్తున్నారట. ఇక నిహారికకు దాదాపు 2 కోట్లు విలువ చేసే బంగారంను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కాకుండా నిహారిక-చైతన్యలకు హైదరాబాద్ లో ఒక ఇంటిని బహుకరించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో అధికారిక ధ్రువీకరణ అంటూ ఏం ఉండదు మరి.


Advertisement

Recent Random Post:

Mahrashtra Election Results :ప్రియాంక గాంధీ ఓడిపోతే వార్త.. గెలిస్తే కాదు : BJP Premender Reddy

Posted : November 23, 2024 at 1:01 pm IST by ManaTeluguMovies

Mahrashtra Election Results :ప్రియాంక గాంధీ ఓడిపోతే వార్త.. గెలిస్తే కాదు : BJP Premender Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad