కన్నడ నిర్మాణ సంస్థ హంబుల్ ఫిల్మ్స్ కొంత కాలం వరకు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే కేజీఎఫ్ సినిమా విడుదల అయ్యిందో అప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఆ పేరు మారు మ్రోగింది. ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో కేజీఎఫ్ 2ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. మరికొన్ని రోజుల్లో కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో హంబుల్ నిర్మాణ సంస్థ కొత్త సినిమాను ప్రకటించబోతుంది. వారు అధికారికంగా తమ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. కొత్త సినిమా అనౌన్స్మెంట్ తేదీకి సంబంధించిన ప్రకటన వచ్చింది.
డిసెంబర్ 2, 2020 న మద్యాహ్నం 2.09 కు తమ తదుపరి ఇండియన్ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఇండియన్ సినిమా అంటూ ప్రకటలో పేర్కొన్నారు. కనుక మరో పాన్ ఇండియా మూవీగా వీరి మూవీ ఉంటుంది అనిపిస్తుంది. కన్నడ సినిమాలు గతంలో మొత్తం సౌత్ ఆడియన్స్ కు కూడా రీచ్ అయ్యేవి కావు. కాని కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమాల స్థాయి పెరిగింది.
అందుకే మరోసారి పాన్ ఇండియా సినిమా గా హంబుల్ నిర్మాణ సంస్థ ఒక కన్నడ సినిమాను రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా విడుదల కాకముందే హంబుల్ సంస్థ కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆ సినిమా దర్శకుడు ఎవరు హీరో ఎవరు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.