Advertisement

మరోసారి తాను రియల్ సూపర్ స్టార్ అని నిరూపించిన మహేష్ బాబు

Posted : November 30, 2020 at 6:40 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ గానే కాదు రీల్ గానూ సూపర్ హీరోనే. సినిమాల్లో తనదైన నటనతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న మహేష్ బాబు, రియల్ లైఫ్ లో చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్స్ చేయిస్తూ అంతకంటే ఎక్కువ మందిని అభిమానులుగా పొందాడు.

ఇప్పటికే చిన్నారుల గుండె ఆపరేషన్ల కేసుల్లో రికార్డు సృష్టించాడు సూపర్ స్టార్. ఈ సంగతులన్నీ భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటారు. రీసెంట్ గా మరో పాపకు గుండె ఆపరేషన్ చేయించాడు మహేష్ బాబు. ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో ఈ మహత్కర కార్యాన్ని గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు.

ఇక రీసెంట్ గా నమ్రత రివీల్ చేసిన వివరాల ప్రకారం మహేష్ డింపుల్ అనే చిన్నారి గుండె ఆపరేషన్ కు స్పాన్సర్ చేసాడు. ఆ చిన్నారి తీవ్రమైన కాల్సిఫైడ్ పల్మొనరీ వాల్వ్ తో తీవ్రమైన పల్మ్ వాల్వ్ స్టెనోసిస్ తో బాధపడుతోంది. ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం ఇంతకు ముందు కంటే బాగుందని చెప్పడానికి ఆనందిస్తున్నట్లు నమ్రత తెలిపింది.

ఇలాంటి సహాయాలు మహేష్ మరిన్ని అందించాలని కోరుకుందాం.


Advertisement

Recent Random Post:

దువ్వాడ, మాధురి పూర్తిగా ఓపెన్ అయిపోయారుగా… | Duvvada Srinivas, Madhuri Spotted in Tirumala

Posted : October 7, 2024 at 1:08 pm IST by ManaTeluguMovies

దువ్వాడ, మాధురి పూర్తిగా ఓపెన్ అయిపోయారుగా… | Duvvada Srinivas, Madhuri Spotted in Tirumala

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad