కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రముఖులను బలి తీసుకుంది. ఇప్పటికే రాజకీయ మరియు సినీ దిగ్గజాలను కూడా కరోనా కాటుకు మృతి చెందారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆయనకు అత్యుత్తమ చికిత్సను అందించేందుకు గాను ఎయిర్ అంబులెన్స్ లో ఇటీవలే చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన్ను కాపాడేందుకు వైధ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కాని వారు విఫలం అయ్యారు.
ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెల్సిందే. వారం కూడా గ్యాప్ లేకుండా మరో రాజ్య సభ సభ్యుడు అయిన అభయ్ భరద్వాజ్ మృతి చెందడం జాతీయ పార్టీ నాయకులకు కలవర పాటుకు గురి చేస్తోంది.
గుజరాత్ కు చెందిన ఈ ఎంపీ బీజేపీలో సీనియర్ నేతగా గుర్తింపు దక్కించుకున్నారు. అభయ్ భరద్వాజ్ మృతిపై బీజేపీ నాయకులు మరియు రాజ్యసభ సభ్యులు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.