Advertisement

వ్యాక్సిన్‌ వచ్చినా మరో ఆరు నెలలు జాగ్రత్త అవసరం

Posted : December 3, 2020 at 11:36 pm IST by ManaTeluguMovies

కరోనా వ్యాక్సిన్‌ ను బ్రిటన్‌ ప్రభుత్వం వచ్చే వారం నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేసింది. ఇతర దేశాల్లో కూడా కరోనా వ్యాక్సిన్‌ క్లీనికల్‌ ట్రయల్స్‌ చివరి దశకు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా జనవరి లేదా ఫిబ్రవరి వరకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉంది.

వ్యాక్సిన్‌ వార్తలు జోరుగా వస్తున్న నేపథ్యంలో జనాలు కరోనాను లైట్‌ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వచ్చేసింది అంటూ మాస్క్‌ లను చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. అది ఏమాత్రం కరెక్ట్‌ కాదని.. రాబోయే ఆరు నెలల పాటు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటూ డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

టీకా వచ్చినంత మాత్రాన వెంటనే కరోనా అదుపులోకి వస్తుందని ఎలా ఊహించుకుంటున్నారు. వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందరికి చేరడంకు చాలా సమయం పడుతుంది. కరోనా కేసులు జీరో అవ్వడానికి ఎంత లేదన్నా ఆరు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలి.

ఈ సమయంలో కొన్ని దేశాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలయ్యింది. కనుక అన్ని చోట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Live Class @99 learn.clapingo.com Book now Sponsored 0:35 learn.clapingo.com Skip 0:22 / 1:02 సుప్రీం కామెంట్లపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు | Daggubati Purandeswari | Supreme Court

Posted : October 1, 2024 at 9:59 pm IST by ManaTeluguMovies

సుప్రీం కామెంట్లపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు | Daggubati Purandeswari | Supreme Court

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad