Advertisement

నటి ఆత్మహత్య.. ఇటీవలే నిశ్చితార్థం అవ్వడంతో పలు అనుమానాలు

Posted : December 9, 2020 at 11:57 am IST by ManaTeluguMovies

ప్రముఖ తమిళ బుల్లి తెర నటి వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య విషయం బుల్లి తెర వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. 28 సంవత్సరాల వయసున్న చిత్రకు ఇటీవలే చెన్నై వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యింది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. ఒక వైపు షూటింగ్‌లతో బిజీగా ఉన్న వీజే చిత్ర మరో వైపు పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ ఇతర పనుల్లో కూడా బిజీ బిజీగా గడుపుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఒక ఫైవ్‌ స్టార్ హోటల్‌ లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కెరీర్‌ పరంగా ఫుల్‌ హ్యాపీగా ఉండటంతో పాటు వ్యక్తిగతంగా మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఎందుకు ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు అంటూ సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడడానికి కొన్ని గంటల ముందు కూడా చిత్ర ఒక సీరియల్‌ షూటింగ్‌ లో పాల్గొంది. అర్థ రాత్రి దాటే వరకు ఆ షూటింగ్‌ లో పాల్గొన్న చిత్ర ఆ తర్వాత హోటల్‌ కు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ఆమెకు ఎవరితో అయితే నిశ్చితార్థం అయ్యిందో ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.


Advertisement

Recent Random Post:

మొదటికి వచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు | Jagan Illegal Assets Case

Posted : May 1, 2024 at 6:07 pm IST by ManaTeluguMovies

మొదటికి వచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు | Jagan Illegal Assets Case

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement