Advertisement

ఎట్టకేలకు హీరోయిన్‌కు బెయిల్‌

Posted : December 11, 2020 at 7:40 pm IST by ManaTeluguMovies

కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో మూడు నెలల క్రితం అరెస్ట్‌ అయ్యి జైల్లో ఉన్న హీరోయిన్‌ సంజన బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. చాలా సార్లు బెయిల్‌ పిటీషన్‌ వేసింది. పలు సార్లు సంజన బెయిల్‌ పిటీషన్‌ ను కోర్టు కొట్టి పారేసిన విషయం తెల్సిందే. ఎట్టకేలకు సంజనకు కర్ణాటక హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అరోగ్య కారణాల వల్ల బెయిల్‌ కావాలంటూ కోరిన సంజన బెయిల్‌ పిటీషన్‌ ను గత నెలలో కొట్టి పారేసిన కోర్టు ఈసారి మాత్రం ఆమెకు కండీషన్స్‌ తో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది.

హైకోర్టు బెయిల్‌ కు పెట్టిన కండీషన్స్‌ ఏంటీ అంటే.. ప్రతి నెల రెండు సార్లు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది, డ్రగ్స్‌ కేసులో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తానంటూ హామీ ఇవ్వాలి, ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో రూ.3 లక్షల వ్యక్తిగత బాండ్‌ ను సమర్పించాల్సి ఉంటుంది. కేసులో సాక్షులను ప్రభావితం చేస్తే వెంటనే బెయిల్‌ రద్దు అవుతుందని కండీషన్స్‌ తో సంజనకు బెయిల్‌ ఇచ్చింది. సంజనతో అరెస్ట్‌ అయిన రాగిణి మాత్రం ఇంకా జైల్లోనే ఉంది. సంజన అనారోగ్య సమస్యల బెయిల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. | AP Cabinet

Posted : November 20, 2024 at 10:49 pm IST by ManaTeluguMovies

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. | AP Cabinet

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad