Advertisement

బర్త్‌డే స్పెషల్‌ : ఆరు పదుల వయసులో కూడా ‘విక్టరీ’నే ఆయన ఇంటి పేరు

Posted : December 13, 2020 at 12:34 pm IST by ManaTeluguMovies


చదువుకుంటున్న సమయంలో అనుకోకుండా హీరో అయిన వెంకటేష్‌ ఆ తర్వాత వెను దిరిగి చూసుకోలేదు. తండ్రి రామానాయుడు పెద్ద నిర్మాత అవ్వడం వల్లే వెంకటేష్‌ హీరో అయ్యారు. కాని తండ్రి వల్లే మాత్రం స్టార్‌ అవ్వలేదు. ఆయన టైమింగ్‌.. నటన.. ఫ్యామిలీ ఆడియన్స్‌ ను ఆకట్టుకోగల ఒక విభిన్న శైలి వెంకటేష్‌ సొంతం. అందుకే ఆయన కెరీర్ లో స్టార్‌ హీరోగా ఎదిగాడు. మొదటి సినిమా కలియుగ పాండవులు సినిమాతో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా పరిచయం అయ్యాడు. 1986 లో హీరోగా పరిచయం అయిన వెంకటేష్‌ ఆ తర్వాత వరుసగా సినిమాలను చేసి మెప్పించాడు.

మొదటి సంవత్సరంలోనే రెండు సినిమాలను చేసిన వెంకటేష్‌ ఆ తర్వత ఏడాది అంటే 1987 లో ఏకంగా అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన కెరీర్‌ లో ఎన్నో అద్బుతమైన యాక్షన్‌ సినిమాలు.. ఫ్యామిలీ సినిమాలు ఇంకా ఎన్నో విభిన్నమైన సినిమాలను వెంకీ చేశాడు. కెరీర్‌ ఆరంభం నుండి కూడా ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేస్తూ వచ్చిన వెంకటేష్‌ సూపర్‌ హిట్‌ లు దక్కించుకుని విక్టరీ అనే పేరును ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ లను దక్కించుకున్న వెంకటేష్‌ పలు ప్లాప్‌ లను కూడా చవిచూశాడు. అయినా కూడా విక్టరీ అనే పేరుకు తగ్గట్లుగా ఆయన సినీ కెరీర్‌ కొనసాగుతోంది.

ఈమద్య కాస్త డల్ అయినట్లుగా అనిపించినా కూడా మళ్లీ వెంకీ తన కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు. ఎఫ్‌ 2 సినిమాతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న ఈయన తదుపరి సినిమా వెంకీ మామతో మెప్పించాడు. ప్రస్తుతం నారప్ప సినిమాను చేస్తున్నాడు. రీమేక్‌ స్టార్‌ అంటూ పేరు పడ్డా కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను మెప్పించడంలో ఎప్పుడు సూపర్‌ హిట్‌ అవుతున్న వెంకీ మామ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయన అభిమానుల తరపున మా తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని ఆయన మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయాలని ఆశిస్తున్నాం. హ్యాపీ బర్త్‌ డే విక్టరీ వెంకటేష్‌.


Advertisement

Recent Random Post:

సర్వ శక్తులు ఒడ్డినా ఓడిపోయిన కాంగ్రెస్ | Local Body Elections | Off The Record

Posted : June 2, 2024 at 8:39 pm IST by ManaTeluguMovies

సర్వ శక్తులు ఒడ్డినా ఓడిపోయిన కాంగ్రెస్ | Local Body Elections | Off The Record

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement