Advertisement

చిరు, మంచు కలయిక.. కారణం సస్పెన్స్‌

Posted : December 23, 2020 at 1:26 pm IST by ManaTeluguMovies

మెగాస్టార్ చిరంజీవిని మంచు హీరో విష్ణు కలిశాడు. వీరిద్దరు కలవడం పెద్ద విషయం ఏమీ కాదు. కాని మంచు విష్ణు ఈ ఫొటోను షేర్‌ చేసి ప్రత్యేకంగా విషయం ఏంటీ అనేది త్వరలో చెప్తాను అంటూ ట్వీట్ చేయడంతో విషయం ఏదో ఉండే ఉంటుంది అంటూ అంతా అనుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడే రివీల్ చేయలేదు కనుక ఏదో పెద్ద విషయమే ఉండి ఉండవచ్చు అంటున్నారు. అది ఏంటీ అనే విషయమై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మంచు విష్ణు షేర్‌ చేసిన ఆ ఫొటో అయితే వైరల్‌ అయ్యింది.

ఇక జనాల ఊహాగానాల విషయానికి వస్తే మంచు విష్ణు ఇటీవలే ‘మోసగాళ్లు’ అనే సినిమాను చేశాడు. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం చిరంజీవిని ఆహ్వానించాడేమో అంటూ కొందరు భావిస్తున్నారు. మరి కొందరు మాత్రం చిరంజీవి చేయబోతున్న మలయాళ సూపర్‌ హిట్ చిత్రం ‘లూసీఫర్‌’ లో మంచు విష్ణు కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని.. ఆ విషయం చర్చించే విషయమై ఇద్దరు కలిసి ఉంటారేమో అంటున్నారు. ఈ రెండు విషయాల్లో ఏది నిజమైనా కూడా మెగా మంచు ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవ్వడం ఖాయం. ఎక్కువ మంది మాత్రం లూసీఫర్‌ లో విష్ణు నటించాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు.


Advertisement

Recent Random Post:

Matka Teaser | Varun Tej | Karuna Kumar | Meenakshi Chowdary | Nora Fatehi | GV Prakash Kumar

Posted : October 5, 2024 at 6:09 pm IST by ManaTeluguMovies

Matka Teaser | Varun Tej | Karuna Kumar | Meenakshi Chowdary | Nora Fatehi | GV Prakash Kumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad