Advertisement

ఆ సమయంలో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానంటున్న రత్తాలు

Posted : January 27, 2021 at 11:57 am IST by ManaTeluguMovies

తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళం హిందీ భాషల ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన రాయ్‌ లక్ష్మి ఇటీవల దుబాయిలో ఉండగా కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆ సమయంలో ఆమె అక్కడ రెండు వారాల పాటు స్వీయ నిర్భందంలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను చాలా మానసిక సంఘర్షణకు లోను అయ్యాను. ప్రతి ఒక్క విషయం నాకు గుర్తుకు వచ్చింది. చాలా సందర్బాల్లో ఒంటరిగా ఆవేదనకు గురి అయ్యాను. ఆ సమయంలో నా కుటుంబ సభ్యుల గురించి వచ్చిన ఆలోచన నాకు ఆందోళన కలిగించింది.

కొత్త సంవత్సరం ఈవెంట్‌ ఆఫర్‌ వచ్చిన సమయంలో నాకు నేను వెళ్లాలని అనుకున్నాను. కాని దుబాయిలో నాకు కరోనా పాజిటివ్‌ రావడంతో చాలా ఇబ్బందులకు గురి అయ్యాను. వేరే ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో మన అన్న వారు ఎవరు లేకపోవడం వల్ల మరింతగా కృంగి పోవాల్సి ఉంటుంది. అదే నాకు జరిగిందని రాయ్‌ లక్ష్మి చెప్పుకొచ్చింది. ప్రస్తుం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారట.


Advertisement

Recent Random Post:

RanaRangam : ఓటమిపై వైసీపీ నేతల పోస్టుమార్టం | YS Jagan | AP Politics

Posted : June 11, 2024 at 1:35 pm IST by ManaTeluguMovies

RanaRangam : ఓటమిపై వైసీపీ నేతల పోస్టుమార్టం | YS Jagan | AP Politics

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement