Advertisement

నారప్ప కూడా రిలీజ్ డేట్ చెప్పేసాడు!

Posted : January 29, 2021 at 6:51 pm IST by ManaTeluguMovies

గత రెండు రోజుల నుండి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏమైందో కానీ వరసగా అందరూ రిలీజ్ డేట్ లను ప్రకటించేస్తున్నారు. ఇదంతా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటనతో మొదలైంది. ఇంకా అంతే దాదాపుగా డజనుకు పైగా సినిమాలు తమ రిలీజ్ డేట్ లను లాక్ చేసుకున్నాయి. ఇంకా ఆ పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ తన నెక్స్ట్ చిత్రం నారప్ప అప్డేట్ తో వచ్చేసాడు.

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేస్తోన్న విషయం తెల్సిందే. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం నారప్పను మే 14న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. నారప్ప షూటింగ్ కూడా పూర్తయినట్లు ఈ సందర్భంగా తెలియజేసారు. ప్రియమణి ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Advertisement

Recent Random Post:

Telangana Congress MLA’s Strength Rises To 70 | CM Revanth Reddy

Posted : June 24, 2024 at 10:37 pm IST by ManaTeluguMovies

Telangana Congress MLA’s Strength Rises To 70 | CM Revanth Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement