సీఎం జగన్ కుటుంబంలో విబేధాల గురించి గత వారం కొత్త పలుకులో వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక కుటుంబంపై తన విశ్లేషణ నీతి మాలిని చర్య అయితే ఈనాడు అధినేత రామోజీరావు కుమారుడు సుమన్ తో ఇంటర్వ్యూ చేసి రామోజీని తిట్టించిన జగన్ కూడా నీతిమాలిన చర్యకు పాల్పడినట్టే కదా. అయినా.. నా వార్తలోని ఎన్నో అంశాలను షర్మిల ఖంచించలేదు. ఒకరు రాసిన ప్రకటనపై షర్మిల సంతకం మాత్రమే చేశారు. ఇందులో ఒత్తిడి కూడా ఉండి ఉండొచ్చు. కారణం..
ఆ వార్త అనంతరం విజయమ్మతోపాటు పులివెందుల నుంచి మరికొందరు బెంగళూరు హడావిడిగా ఎందుకు వెళ్లారో.. అక్కడ ఏం జరిగిందో.. ఏ ప్రభావంతో ఆమె సంతకం చేశారో నాకు తెలియదు అనుకోవద్దు. వైఎస్ తర్వాత జగన్ సీఎం అయ్యారు. షర్మిల ప్రచారం కూడా చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కుటుంబంలో విబేధాలు వస్తే వార్త అవుతుంది. నేను రాసింది అసత్యాలని విజయమ్మ, షర్మిల బైబిల్ పై ఒట్టేసి చెప్తే.. నేను బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధం.. అని అన్నట్టుగా వివరణ ఉంది.