సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్ ను ముగించడంతో పాటు వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోతున్న సినిమాలు ఇదే ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆయన కొత్త సినిమా త్వరలో ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం ఇద్దరు తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సుధ కొంగర గత ఏడాది సూరారై పోట్రూ సినిమాతో ఘన విజయం సాధించింది. ఆమె గురించి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. కనుక ఆమెతో ఒక సినిమా చేసే విషయమై మహేష్ బాబు చర్చిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో మరో తమిళ దర్శకుడు వినోద్ తో కూడా మహేష్ టీమ్ చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు దర్శకులతో ఒకరితో మహేష్ వచ్చే ఏడాది వర్క్ చేసే అవకాశం ఉందంటున్నారు.