Advertisement

నాగార్జున సినిమాలో కీలక పాత్ర చేయనున్న అజిత్‌ కూతురు

Posted : February 9, 2021 at 2:52 pm IST by ManaTeluguMovies

నాగార్జున ఇటీవలే వైల్డ్‌ డాగ్ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. ఇదే సమయంలో నాగార్జున ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నట్లుగా కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. మద్యలో ఆ సినిమా అప్ డేట్‌ ఏమీ లేదు. దాంతో ప్రవీణ్‌ సత్తార్ దర్శకత్వంలో సినిమా అసలు ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు ఆ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్‌ అప్ డేట్‌ వచ్చింది. సినిమాలో కీలక పాత్రకు గాను తమిళ నటి అనిక సురేంద్రన్‌ ను ఎంపిక చేశారట.

తమిళ ఆడియన్స్‌ కు అనిక అంటే వెంటనే అజిత్ కూతురు అంటూ గుర్తుకు వస్తుంది. అనిక ఈమద్యే హీరోయిన్‌ గా కూడా పరిచయం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ఈ క్యూటీ త్వరలోనే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఈ 16 ఏళ్ల అమ్మాయిని నాగార్జున సినిమాలోని కీలక పాత్రకు గాను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. నాగార్జున కూతురుగా అనిక ఏమైనా కనిపించబోతుందా లేదంటే మరో కీలక పాత్ర ఏమైనా ఆమె చేస్తుందా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.


Advertisement

Recent Random Post:

జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు | Case Filed On Choreographer Jani Master

Posted : September 18, 2024 at 12:12 pm IST by ManaTeluguMovies

జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు | Case Filed On Choreographer Jani Master

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad