Advertisement

ఇంకా ఎన్ని విపత్తులు రావాలి.. అనసూయ ఎమోషనల్‌ ట్వీట్‌

Posted : February 9, 2021 at 7:58 pm IST by ManaTeluguMovies

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ రెగ్యులర్‌ గా ఏదో ఒక సామాజిక విషయమై స్పందిస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. తాజాగా ఉత్తరఖండ్‌ లో జరిగిన పకృతి విలయంలో దాదాపుగా 170 మంది జల సమాధి అవ్వడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఊహించకుండా వచ్చిన ఈ పకృతి విపత్తు ఖచ్చితంగా మనం చేసిన తప్పిదాల వల్లే వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటివి ఇతర దేశాల్లో వస్తున్న సమయంలో వారు మార్పులు చెందుతూ వస్తున్నారు. కాని మనం మాత్రం ఇంకా మారడం లేదు.

మనం పకృతిని కాపాడుకోవడం కోసం ఏం చేయడం లేదు. ఇలాంటి పకృతి విపత్తులు వచ్చిన సమయంలో జాగ్రత్తగా ఉండకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇకపై అయినా ఇలాంటి విపత్తులు జరుగవు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి విపత్తుల నుండి గుణపాఠం నేర్చుకోవాల్సింది పోయి ప్రతి ఒక్కరు కూడా కొన్ని రోజులకే మర్చి పోయి మళ్లీ పర్యావరణం గురించి పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు పడుతున్నారు అంటూ అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది. పకృతి వైపరిత్యాలకు కారణం అయిన కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చింది.


Advertisement

Recent Random Post:

Janatha Darbar : తిరుపతి ప్రజల పల్స్ ఎలా ఉంది..? | Tirupati Assembly constituency

Posted : May 7, 2024 at 11:41 am IST by ManaTeluguMovies

Janatha Darbar : తిరుపతి ప్రజల పల్స్ ఎలా ఉంది..? | Tirupati Assembly constituency

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement