Advertisement

రాధేశ్యామ్‌ ఫస్ట్ గ్లిమ్స్‌ డైలాగ్‌ లీక్‌

Posted : February 12, 2021 at 10:54 pm IST by ManaTeluguMovies

ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఒక్క షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా నుండి ఒక ప్రత్యేక వీడియోను లవర్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఆ వీడియో నిమిషం కంటే తక్కువే ఉంటుందట. దానిలోని డైలాగ్‌ లు అప్పుడే లీక్ అయ్యాయి. ఆ లీక్ డైలాగ్‌ లు సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆ వీడియోలో ప్రభాస్ మరియు పూజా హెగ్డేలు కనిపించబోతున్నారట.

పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రేరణ పాత్రలో కనిపించబోతుండగా ప్రభాస్ విక్రమ్‌ ఆధిత్య పాత్రలో కనిపించనున్నాడు. విక్రమ్‌ ఆధిత్యతో ప్రేరణ… నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా అంటే అందుకు సమాధానంగా విక్రమ్‌ ఆధిత్య ప్రేమ కోసం రోమియో చనిపోయాడు మనం అలా కాదు అంటాడట. ఈ సీన్‌ సినిమాలో చాలా రొమాంటిక్‌ గా ఉంటుందని అంటున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా విడుదల కాబోతున్న ఈ గ్లిమ్స్‌ అదిరి పోయే అవకాశం ఉందని అంటున్నారు.


Advertisement

Recent Random Post:

Pawan Kalyan Tirupati Varahi Meeting : సీక్రెట్స్ ఆఫ్ పవన్ ‘రెడ్ బుక్’ | Varahi Declaration Book

Posted : October 3, 2024 at 11:56 am IST by ManaTeluguMovies

Pawan Kalyan Tirupati Varahi Meeting : సీక్రెట్స్ ఆఫ్ పవన్ ‘రెడ్ బుక్’ | Varahi Declaration Book

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad