Advertisement

ఏప్రిల్ నెలాఖరుకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి

Posted : February 23, 2021 at 7:07 pm IST by ManaTeluguMovies

స్లోగా సినిమాలు తీస్తాడన్న పేరున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా రెండేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు. అయితే లాక్ డౌన్ తర్వాత రిలీజ్ డేట్ల విషయంలో క్లారిటీ కోసం అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి ముందుగానే ప్రకటించాడు. ఏప్రిల్ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది అన్నది లేటెస్ట్ అప్డేట్.

ఇప్పటికే ఎన్టీఆర్ కు సంబంధించి మెజారిటీ షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో ఎన్టీఆర్ కు సంబంధించిన షెడ్యూల్ జరుగుతుంది. దీంతో మొత్తంగా ఎన్టీఆర్ పార్ట్ పూర్తి కానుంది. అలాగే ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్, మార్చ్ కల్లా తన పార్ట్ ను పూర్తి చేస్తాడు.

ఏప్రిల్ లో తిరిగి ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో జాయిన్ అవుతాడు. అదే నెలలో చరణ్, అలియా భట్ లతో రెండు పాటలను షూట్ చేస్తారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొత్తానికి పూర్తవుతుంది.


Advertisement

Recent Random Post:

Supreme Court Tough Questions to TDP Govt Lawyer | Tirumala Laddu Controversy |

Posted : September 30, 2024 at 7:55 pm IST by ManaTeluguMovies

Supreme Court Tough Questions to TDP Govt Lawyer | Tirumala Laddu Controversy |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad