Advertisement

తనపై వచ్చిన మీమ్స్ పై సరదాగా స్పందించిన ప్రియాంక చోప్రా

Posted : February 24, 2021 at 11:13 pm IST by ManaTeluguMovies

ఈరోజుల్లో ఏదైనా క్షణాల్లో మీమ్ మెటీరియల్ అయిపోతోంది. సాధారణానికి కాస్త విభిన్నంగా ఏది కనిపించినా కానీ మీమ్ రాయుళ్లు తమ మెదడుకు పని చెబుతున్నారు. ఈ మీమ్స్ చాలా ఫన్నీగా ఉంటుండడంతో సెలబ్రిటీలు కూడా తమపై వచ్చిన మీమ్స్ ను చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు. కొందరైతే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు కూడా.

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన ప్రియాంక చోప్రా కూడా ఈ కోవలోకే చెందుతుంది. తనపై వచ్చిన మీమ్స్ కు పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. తన రోజును సంతోషంగా మార్చినందుకు ధన్యవాదాలు అని తెలిపింది.

ఇక విషయంలోకి వెళితే గుండ్రటి బంతి ఆకారంలో ఉన్న డ్రెస్ ను ఇటీవలే వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రియాంక. చూడటానికి చాలా వెరైటీగా ఉండడంతో ప్రియాంక చోప్రాపై మీమ్స్ నిమిషాల్లో పుట్టుకొచ్చాయి. ఆమె కూడా సరదాగా తీసుకోవడంతో అంతా హ్యాపీ.


Advertisement

Recent Random Post:

బోటు ఆపరేషన్ H బ్లాక్ సక్సెస్ | Boat Removal Operation At Prakasam Barrage

Posted : September 18, 2024 at 12:44 pm IST by ManaTeluguMovies

బోటు ఆపరేషన్ H బ్లాక్ సక్సెస్ | Boat Removal Operation At Prakasam Barrage

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad