Advertisement

చిరు, చరణ్ ల మాస్‌ సాంగ్‌.. ఫ్యాన్స్‌ పూనకాలే

Posted : March 10, 2021 at 3:08 pm IST by ManaTeluguMovies

మెగా అభిమానులు ఆచార్య సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. మొదటి సారి చిరంజీవి సినిమాలో చరణ్ ఒక పూర్తి స్థాయి పాత్రను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత చరణ్‌ ఆర్‌ఆర్ఆర్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక మెగా అభిమానుల కోసం ఒక మాస్ మసాలా పాటను చిరు మరియు చరణ్ కాంబోలో పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో వచ్చిన మాటల మాదిరిగా అలా వచ్చి ఇలా అన్నట్లుగా కాకుండా తండ్రి కొడుకు ఇద్దరు కూడా పాటలో ఫూర్తి స్థాయిలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ పాట కోసం మాస్ మసాలా బీట్ ను ట్యూన్‌ చేయించడంతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ను రంగంలోకి దించబోతున్నారు. ఈ పాటను చిత్రీకరించి సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారట. వచ్చే నెలలో ఆ పాట చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. సినిమా ను మే లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

భారత్‌ తూటాలతో రష్యాపై ఉక్రెయిన్‌ దాడి ! | Ukraine Attacked Russia With Indian bullets

Posted : September 20, 2024 at 1:18 pm IST by ManaTeluguMovies

భారత్‌ తూటాలతో రష్యాపై ఉక్రెయిన్‌ దాడి ! | Ukraine Attacked Russia With Indian bullets

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad