Advertisement

జాన్వీ కపూర్ సినిమాకు దారుణమైన కలెక్షన్స్!

Posted : March 15, 2021 at 11:18 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా రూహీ. హారర్ కామెడీగా రూపొందించిన ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో వెనుకడుగు వేస్తోంది. వారాంతం మొత్తం కలిపి నాలుగు రోజులకు ఈ సినిమా కేవలం 12.38 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. రూహీ చిత్రానికి తొలి ఆట నుండే మిశ్రమ స్పందన రావడం మొదలైంది. మహా శివరాత్రి పర్వదినాన విడుదలైన ఈ చిత్రానికి టాక్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపించింది.

మొదటి రోజున ఈ చిత్రం 3.0 కోట్లను కలెక్ట్ చేయగా, రెండో రోజున 2.25 కోట్ల రూపాయలు, ఇక మూడో రోజున 3.42 కోట్ల రూపాయలు, నిన్న ఆదివారం రోజున 3.85 కోట్ల రూపాయలతో రూహీ మొత్తంగా 12.38 కోట్లను వసూలు చేసింది. ఇక సోమవారం నుండి గురువారం వరకూ ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ ను బట్టి చిత్ర విజయావకాశాలను తెలియజేయవచ్చు.


Advertisement

Recent Random Post:

Hamsa Nandini is Back || Hamsa Nandini || Nikhil Vijayendra Simha

Posted : July 2, 2024 at 7:28 pm IST by ManaTeluguMovies

Hamsa Nandini is Back || Hamsa Nandini || Nikhil Vijayendra Simha

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement