Advertisement

మురిసిపోతున్న మెహరీన్..! అంత అందంగా లవ్ ప్రపోజ్ చేస్తాడనుకోలేదు..!!

Posted : March 21, 2021 at 1:16 pm IST by ManaTeluguMovies

ఒకరిపై ప్రేమ పుట్టడం కాదు.. ఆ ప్రేమను ఎంత అందంగా వ్యక్తం చేశామన్నది కూడా ముఖ్యమే. టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ అటువంటి అపురూపమైన లవ్ ప్రపోజల్ అందుకుంది. జీవితమంతా గుర్తుండేలా లవ్ ప్రపోజ్ చేశాడు ఆమెకు కాబోయే భర్త భవ్య బిష్ణోయ్. అయితే.. ఈ ప్రపోజల్ అండమాన్ లో తాను స్కూబా డైవింగ్ నేర్చుకుంటున్న సమయంలోనే జరిగిందట. ఈ విషయాన్ని మెహరీన్ స్వయంగా వెల్లడించి మురిసిపోయింది.

ఓసారి అండర్ వాటర్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బిష్ణోయ్ తన దగ్గరకు వచ్చి, మోకాళ్ళ మీద వంగి లవ్ ప్రపోజ్ చేశాడని చెప్పుకొచ్చింది. తాను ఈ సంఘటనను అసలు ఊహించలేదని అంటోంది. కానీ.. చాలా గమ్మత్తుగా అలా జరిగిపోయిందని తెలిపింది. తాము డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నామని చెప్తోంది. డేట్ ను మాత్రం చెప్పలేదు. ఇటివలే వీరిద్దరికీ రాజస్థాన్ వేదికగా నిశ్చితార్ధం కూడా జరిగింది. ప్రస్తుతం మెహ్రీన్ తెలుగులో ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తోంది.


Advertisement

Recent Random Post:

కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో దారుణం.. | Konaseema District

Posted : November 1, 2024 at 1:10 pm IST by ManaTeluguMovies

కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో దారుణం.. | Konaseema District

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad