Advertisement

స్టార్‌ నటుడికి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక

Posted : March 22, 2021 at 12:33 pm IST by ManaTeluguMovies

తమిళ స్టార్‌ నటుడు కార్తీక్‌ అనారోగ్యం పాలయ్యారు. మనిద ఉరిమై పార్టీ వ్యవస్థాపకుడు అయిన కార్తీక్‌ ఎన్నికల ప్రచారంలో గత కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అనూహ్యంగా అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే ఆయన్ను స్థానికి ఆసుపత్రిలో జాయిన్‌ చేసి చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైధ్యులు చెప్పారు. విశ్రాంతి అవసరం అన్నట్లుగా సూచించినట్లుగా తెలుస్తోంది.

అన్నాడీఎంకే మరియు బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న కార్తీక్‌ మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ను కలిగి ఉన్న కార్తీక్ అనారోగ్యం పాలయ్యాడు అంటూ తెలిసిన వెంటనే అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగులో ఇప్పటికి కూడా కార్తీక్ నటించిన సినిమా లు బుల్లి తెరపై ప్రదర్శితం అవుతూనే ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

Kadaisi Ulaga Por – Official Trailer | Hiphop Tamizha | HHT Entertainment

Posted : September 14, 2024 at 2:35 pm IST by ManaTeluguMovies

Kadaisi Ulaga Por – Official Trailer | Hiphop Tamizha | HHT Entertainment

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad