నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. ఆయన కొన్ని సందర్బాల్లో చేసే ట్వీట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ఆయన రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ను లైక్ చేసి విమర్శల పాలు అయ్యాడు. ఇక ఆయన ఎన్నో సందర్బాల్లో తప్పుగా ట్యాగ్ చేసి కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా మరోసారి ఒక ఇంగ్లీష్ పదం స్పెల్లిగ్ తప్పుగా రాసి ఇదేం చదువు నాయన నీవు ఏ బల్లో చదువుకున్నావు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మాస్క్ గురించిన అవగాహణ కల్పించేందుకు పోలీసులు వివిధ మార్గాలను అనుసరిస్తూ ఉన్నారు. మాస్క్ లు ధరించకుంటే రెండు వేల రూపాయల ఫైన్ వేయబడును అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే ఒక వ్యక్తికి వేసిన చలాన ను పోలీసులు షేర్ చేశారు. ఆ మాస్క్ చలానాను బండ్ల గణేష్ షేర్ చేసి తప్పకుండా మాస్క్ ధరించాలని చెప్పాలనుకున్నాడు. అందుకోసం Wear మాస్క్ అని రాకుండా where మాస్క్ అని రాశాడు. మొదటిది మాస్క్ ధరించాలి అని అర్థం వస్తే బండ్ల రాసింది మాత్రం మాస్క్ ఎక్కడ అనే అర్థం వస్తుంది. దాంతో బండ్ల గణేష్ ట్వీట్ స్క్రీన్ షాట్ తీసి పరువు తీసే పని పెట్టుకున్నారు కొందరు.