Advertisement

మామిడి తోటలో బిబి స్టార్స్ ఎంజాయ్‌

Posted : March 30, 2021 at 7:24 pm IST by ManaTeluguMovies

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 4 ఎంతో మంది కొత్త సెలబ్రెటీలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. గత మూడు సీజన్‌ లకు ఈ సీజన్ కంటెస్టెంట్స్ చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో కొందరు అత్యంత ఆత్మీయులుగా మారిపోయారు. అంతకు ముందు కనీసం మొహం కూడా చూసుకోని వారు ఇప్పుడు చాలా ఆప్తులు స్నేహితులు అయ్యారు. అవినాష్ మరియు అరియానాలు క్లోజ్‌ ఫ్రెండ్స్ అయ్యారు. వారు లవర్స్ అంటూ ప్రచారం జరిగేంతగా వారిద్దరి మద్య స్నేహం కొనసాగుతోంది.

ఇద్దరి మద్య ఏం లేదని పదే పదే చెబుతూనే ఉన్నారు. కనుక ఇద్దరు మంచి స్నేహితులు అనే అనుకుందాం. ఇక ఇద్దరు ఇటీవల లాంగ్ ట్రిప్‌ కు వెళ్లారు. అక్కడ సరదాగా స్నేహితులతో ఎంజాయ్‌ చేశారు. మామిడి తోట ఫామ్ హౌస్ లో సరదాగా గడిపిన ఫొటోలను వీరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. స్నేహితులు అంతా కలిసి వెళ్లిన ఈ ట్రిప్ సరదాగా సాగిందని వారు చెబుతున్నారు. ఫొటోలు వైరల్‌ అవ్వడంతో మళ్లీ వీరి మద్య ఏమైనా ఉండి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Advertisement

Recent Random Post:

Kolkata Doctor Case : మరో టర్న్ తీసుకున్న డాక్టర్ హత్యాచారం కేసు

Posted : September 13, 2024 at 10:28 pm IST by ManaTeluguMovies

Kolkata Doctor Case : మరో టర్న్ తీసుకున్న డాక్టర్ హత్యాచారం కేసు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad