Advertisement

నాని ‘టక్‌ జగదీష్‌’ కు మణిరత్నం క్లాసిక్‌ మూవీతో సంబంధం!

Posted : March 31, 2021 at 1:15 pm IST by ManaTeluguMovies

నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన టక్‌ జగదీష్‌ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ఒక కుటుంబ కథా చిత్రం అంటూ ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ మరియు పోస్టర్‌ లతో అర్థం అవుతుంది. నాని లుక్‌ చాలా క్లాస్ గా ఆకట్టుకునే విధంగా ఉంది అంటూ అభిమానుల నుండి టాక్‌ వచ్చింది. ఇదే సమయంలో సినిమా కు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను మణిరత్నం క్లాసిక్‌ మూవీతో పోల్చుతూ ఆ రేంజ్‌ లో ఉంటుందని కూడా పాజిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

మణిరత్నం పాత సినిమా ఘర్షణ తరహాలో టక్‌ జగదీష్‌ సినిమాలో కూడా బ్రదర్స్‌ మద్య స్ట్రాంగ్‌ ఎమోషన్‌ సీన్స్‌ మరియు సెంటిమెంట్‌ సీన్స్‌ ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సినిమాపై మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను వచ్చే నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. నాని మరియు శివ నిర్వానల కాంబోలో వచ్చిన నిన్ను కోరి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు.


Advertisement

Recent Random Post:

విశాఖ లో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని విస్తృత ప్రచారం | Tejaswini Campaign In Visakha |

Posted : April 26, 2024 at 12:29 pm IST by ManaTeluguMovies

విశాఖ లో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని విస్తృత ప్రచారం | Tejaswini Campaign In Visakha |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement