Advertisement

ఓటుకు నోటు కేసుః చంద్రబాబు నాతో మాట్లాడారు

Posted : April 2, 2021 at 1:34 pm IST by ManaTeluguMovies

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తెలంగాణలో తెలుగు దేశం పార్టీ కనిపించకుండా పోయింది అనడంలో సందేహం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలంటూ స్టీఫెన్‌ సన్‌ కు రేవంత్‌ రెడ్డి దాదాపుగా 50 లక్షలు లంచం ఇస్తూ అడ్డంగా బుక్‌ అయ్యాడు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్టీఫెన్ సన్‌ వాంగ్మూలంను ఏసీబీ అధికారులు తీసుకున్నారు.

ఏసీబీ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో స్టీఫెన్‌ సన్‌ తనకు స్వయంగా చంద్రబాబు నాయుడు కాల్‌ చేశారని పేర్కొన్నాడు. మన వాళ్లు వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడుతారు అంటూ నాతో అన్న సమయంలో పార్టీలో కీలక వ్యక్తి వస్తేనే తాను మాట్లాడుతాను అంటూ చెప్పడంతో రేవంత్‌ రెడ్డి వచ్చారని స్టీఫెన్‌ సన్‌ పేర్కొన్నారు. తకు 50 లక్షల డబ్బుతో పాటు ఇంకా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. లంచం తీసుకోవడం ఇష్టం లేక తాను ఏసీబీ వారికి సమాచారం అందించాను. వారు మా ప్లాట్‌ లో కెమెరాలు ఫోన్‌ లు పెట్టారని వాంగ్మూలంలో స్టీఫెన్‌ సన్‌ చెప్పుకొచ్చాడు.


Advertisement

Recent Random Post:

జగన్ కు షాకిచ్చిన జనం | YS Jagan shocked at Humiliating defeat

Posted : June 5, 2024 at 12:18 pm IST by ManaTeluguMovies

జగన్ కు షాకిచ్చిన జనం | YS Jagan shocked at Humiliating defeat

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement