Advertisement

16 ఏళ్ల వయసులోనే జాబ్‌, డేటింగ్‌ – అనసూయ

Posted : April 7, 2021 at 11:58 am IST by ManaTeluguMovies

ప్రస్తుతం తెలుగు బుల్లి తెర మరియు వెండి తెరపై ఆమె జోరు అంతా ఇంతా కాదు. ఆమె మరెవ్వరో కాదు జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ. సినిమాల్లో వరుసగా నటిస్తూనే జబర్దస్త్‌ కు యాంకర్‌ గా చేస్తున్న ముద్దుగుమ్మ అనసూయ తాజాగా ఒక లైవ్‌ షో లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆ సందర్బంగా తన ఫస్ట్‌ జాబ్‌ మరియు తన డేటింగ్‌ విషయాన్ని చెప్పుకొచ్చింది. తన 16వ ఏటనే ఈ రెండు జరిగాయని అనసూయ చెప్పుకొచ్చింది. హైదరాబాద్‌ లో పుట్టి పెరిగిన తాను బీహారిని పెళ్లి చేసుకున్నట్లుగా పేర్కొంది.

తను 16 ఏట ఉన్న సమయంలో సాక్షి టీవీలో న్యూస్‌ రీడర్‌ గా అవకాశం దక్కింది. ఆ సమయంలోనే భరత్వాజ్ తో పరిచయం అయ్యింది. మా వ్యవహారం బయట తెలియదు కాని సాక్షి టీవీలో మాత్రం నాతో పని చేస్తున్న అందరికి తెలుసు. ఆ సమయంలో చాలా టెన్షన్‌ పడేదాన్ని. నా వయసు 16 ఏళ్లు అయితే ఆయన వయసు 19 ఏళ్లు. ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం. బిర్లా టెంపుల్‌ ను నాకు మొదట చూపించింది ఆయనే అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుని అనసూయ మురిసి పోయింది.


Advertisement

Recent Random Post:

Dialogue War : CM Revanth Reddy Vs Etela Rajender

Posted : April 28, 2024 at 7:34 pm IST by ManaTeluguMovies

Dialogue War : CM Revanth Reddy Vs Etela Rajender

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement