Advertisement

బీజేపీలో చేరిన సినీ నటి హేమ.. రత్నప్రభ అసెంబ్లీకి వెళ్ళాలట.!

Posted : April 12, 2021 at 8:40 pm IST by ManaTeluguMovies

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్.. బీజేపీలో చేరిన వైసీపీ నేత హేమ.. బులుగు బ్యాచ్ చేసే ప్రచారానికి, అదే స్థాయిలో సమాధానమివ్వాలంటే, పెట్టాల్సిన హెడ్డింగ్ ఇది. జనసేన నుంచో, టీడీపీ నుంచో చోటా మోటా నాయకులు, వైసీపీలోకి వెళితే.. ఆయా పార్టీల మీద బురద చల్లేందుకు బులుగు మీడియా ‘మైండ్ బ్లాంక్’ అయ్యే బ్రేకింగ్ న్యూసులు, హెడ్ లైన్లు పెడుతుంటుంది మరి.

సరే, అసలు విషయానికి వద్దాం.. వైసీపీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు సినీ నటి హేమ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పర్యటన సందర్భంగా బీజేపీలో హేమ చేరారు.. బీజేపీలో చేరడం పట్ల చాలా ఆనందంగా వుందన్నారు. షరామామూలుగానే ‘వకీల్ సాబ్’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు హేమ, తన ప్రసంగంలో.

‘మన అన్న సినిమా..’ అంటూ హేమ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోపక్క, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ పేరు పలకడానికీ హేమ ఇబ్బంది పడ్డారు. అంతేనా, బోల్డంత కామెడీ చేశారు. రత్నప్రభని భారీ ఓటు బ్యాంకుతో ఏకంగా అసెంబ్లీకి పంపించెయ్యాలట. జరుగుతున్నది లోక్ సభ ఉప ఎన్నిక అని కూడా తెలుసుకోకుండానే హేమ, ఎగేసుకుని.. తిరుపతి వచ్చేశారనుకోవాలా.? లేదంటే, అంత పెద్దయెత్తున జన సమూహాన్ని చూసి ఆమె గందరగోళానికి గురయ్యారా.? ఇవేవీ కాదు, వైసీపీ కోవర్టుగా.. బీజేపీలోకి హేమ వచ్చారని అర్థం చేసుకోవాలా.?

డౌటానుమానాలు చాలానే క్రియేట్ అవుతున్నాయ్. అన్నట్టు, జేపీ నడ్డాతోపాటు పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం చేసి వుండాల్సింది. తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో పవన్ కళ్యాణ్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిన విషయం విదితమే. కాగా, రత్నప్రభను అసెంబ్లీకి పంపాలంటూ హేమ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పుకోలేకపోతున్నాయి.. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురవుతున్న ట్రోలింగ్ నేపథ్యంలో.


Advertisement

Recent Random Post:

Poll India : ఖర్చు పెట్టలేక తప్పుకుంటున్న అభ్యర్థులు | Lok Sabha Elections 2024

Posted : May 7, 2024 at 9:44 pm IST by ManaTeluguMovies

Poll India : ఖర్చు పెట్టలేక తప్పుకుంటున్న అభ్యర్థులు | Lok Sabha Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement