Advertisement

ప్రభాస్ హీరోయిన్‌ కు కరోనా పాజిటివ్‌

Posted : April 20, 2021 at 5:35 pm IST by ManaTeluguMovies

కరోనా బారిన గత ఏడాది ఎంతో మంది సెలబ్రెటీలు పడ్డారు. సెకండ్‌ వేవ్‌ తో సెలబ్రెటీలకు పెద్దగా ఇబ్బంది ఉండక పోవచ్చు అంటూ మొన్నటి వరకు అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా పదుల సంఖ్యలో సెలబ్రెటీలు ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారు కరోనా బారిన పడుతున్నారు. పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అందులో సినీ ప్రముఖుల సంఖ్య కూడా చాలానే ఉంది. తాజాగా ప్రభాస్ తో హీరోయిన్ గా నటించిన సంజన గర్లానీ కూడా కరోనా బారిన పడ్డట్లుగా తెలుస్తోంది.

సంజన సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేసింది. తనకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందని పేర్కొంది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం తాను పూర్తిగా ఇంటికే పరిమితం అయినట్లుగా పేర్కొంది. డ్రగ్స్ కేసులో ఈమె ఆమద్య రెండు నెలల పాటు జైల్లో ఉన్న విషయం తెల్సిందే. ఆ సమయంలోనే ఈమె అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కరోనా బారిన పడటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Matka Teaser | Varun Tej | Karuna Kumar | Meenakshi Chowdary | Nora Fatehi | GV Prakash Kumar

Posted : October 5, 2024 at 6:09 pm IST by ManaTeluguMovies

Matka Teaser | Varun Tej | Karuna Kumar | Meenakshi Chowdary | Nora Fatehi | GV Prakash Kumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad