Advertisement

థాంక్‌ యూ బ్రదర్‌: అనసూయకు అంత ముట్టింది!

Posted : May 6, 2021 at 12:10 pm IST by ManaTeluguMovies

అనసూయ భరద్వాజ్‌.. నటనతో, మాటలతో, డ్యాన్సులతో, చిలిపి చేష్టలతో అభిమానులను నిత్యం అలరిస్తూ ఉంటుందీ యాంకర్‌. బుల్లితెర, వెండితెర మీద మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలోనూ ఫొటో షూట్‌లతో, చిట్‌చాట్‌లతో ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇదిలా వుంటే ఆమె ఇటీవలే ప్రధాన పాత్రలో నటించిన ‘థాంక్‌ యూ బ్రదర్‌’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో మే 7 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది.

ఆహా ఈ చిత్రాన్ని రూ.1.8 కోట్లకే కొన్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజాగా ‘థాంక్‌ యూ బ్రదర్‌’ కోసం అనసూయ తీసుకున్న పారితోషికం వివరాలు లీకయ్యాయి. 17 రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌ ఉంటే.. ఆమె ఒక్క రోజుకే రూ.1.5 లక్షలు తీసుకుందట. అంటే మొత్తంగా పాతిక లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో రమేశ్‌ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనసూయ గర్భిణిగా నటిస్తోంది. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

కల్కి సినిమాతో వెలుగులోకి నెల్లూరు జిల్లా పేరుమాళ్లపాడు శివాలయం | Kalki 2898 Movie

Posted : June 30, 2024 at 8:50 pm IST by ManaTeluguMovies

కల్కి సినిమాతో వెలుగులోకి నెల్లూరు జిల్లా పేరుమాళ్లపాడు శివాలయం | Kalki 2898 Movie

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement